వాతావరణం స్పోర్ట్స్ జాబ్ - ఎడ్యుకేషన్ బిజినెస్ లైఫ్ స్టైల్
రాశి ఫలాలు

మెగాస్టార్ చిరంజీవికి బిజెపి తరఫునుంచి బంపర్ ఆఫర్

On: January 28, 2024 10:16 AM
Follow Us:

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్న సందర్భంగా , ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మా రాయి.   ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే బరిలోకి దిగారు.   జగన్ ఓటమి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన జతకట్టాయి.  ఇటు షర్మిలకు కాంగ్రెస్ పార్టీ  ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలు అప్పజెప్పింది.   బిజెపి తమతో కలిసి రావాలని నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు.  ఇదే సమయంలో బిజెపి మెగా స్కెచ్ సిద్ధం చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాజకీయం ఏంటి అనేది క్లారిటీ వస్తుంది.   తెలుగుదేశం పార్టీ , జనసేనతో బిజెపి కలవడం పైన కొత్త కొత్త సందేహాలు మొదలవుతున్నాయి.  భారతీయ జనతా పార్టీ తమతో కలిసి వస్తుందని , 2014 నాటి పొత్తులు రిపీట్ చేయాలని నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. కానీ బిజెపి నుంచి ఇప్పటివరకు ఒక స్పష్టత లేదు.  తెలంగాణలో బీసీ నినాదంతో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటింగ్ శాతం పెరిగింది.

Untitled design 9

ఆంధ్రప్రదేశ్లో పొత్తుతో వెళ్లటమా లేదా ఒంటరిగా పోటీ చేయడమా అనేది పార్టీల్లో చర్చ కొనసాగుతుంది.  నిర్ణయానికి ముందు అన్ని అంశాల పైన చర్చిస్తోంది. సొంతంగా ఎదిగేందుకు ఉన్న అవకాశాల పైన కసరత్తు చేస్తుంది.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలే కీలకము. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇదే అంశం ఆధారంగా కొత్త లెక్కలు సిద్ధం చేస్తుందని సమాచారం.

బిజెపి ప్రస్తుతం జనసేనతో పొత్తు కొనసాగిస్తుంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతోనే తమ పొత్తు అనే అంశాన్ని స్పష్టం చేస్తుంది. టిడిపి తో కలుస్తుందా లేదా అనేది తేల్చడం లేదు ఈ సమయంలోనే పవన్ ఢిల్లీ రావాల్సిందిగా బిజెపి నేతల నుంచి ఆహ్వానం అందింది సమయం ఆసన్నమైంది.

ఇదే సమయంలో ఏపీలో కాపు-కమ్మ వర్గాలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. పురందేశ్వరికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. పవన్ తో పొత్తు ద్వారా కాపు మెజార్టీ వర్గం తమ వైపు ఉంటుందని భావిస్తోంది. అయోధ్య రామాలయం ద్వారా వర్గాలకు అతీతంగా తమకు మద్దతు పెరిగినట్లు అంచనా వేస్తోంది. ఈ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది.

బీజేపీ మెగా స్కెచ్: ఇక, ఇప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడను తమ పార్టీలో చేర్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్య నేతల సమాచారం. పార్టీలకు అతీతంగా ఈ నియామక ప్రక్రియ ఉంటుంది. సినీ రంగం నుంచి 2022లో విజయేంద్ర ప్రసాద్ ను నియమించారు. ఇప్పుడు చిరంజీవికి అవకాశం ఇవ్వటం ద్వారా కొత్త వ్యూహం సిద్ద చేస్తున్నట్లు చెబుతున్నారు.

గతంలో చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా యూపీఏ-2లో కేంద్ర మంత్రిగా పని చేసారు. పవన్ తో పొత్తు కొనసాగిస్తూ..చిరంజీవికి రాజ్యసభకు పంపటం ద్వారా ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తోంది. నామినేటెడ్ కోటాలో ఈ ఏడాది నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. మరి..బీజేపీ ఆఫర్ ను సినిమాల్లో బిజీగా ఉంటూ..దాదాపు రాజకీయాలకు దూరమైన చిరంజీవి అంగీకరిస్తారా..లేదా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

మరిన్ని వార్తలు :

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జెసికి చంద్రబాబు షాక్

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “మెగాస్టార్ చిరంజీవికి బిజెపి తరఫునుంచి బంపర్ ఆఫర్”

Leave a Comment