2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..

2024 ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్సభ సీట్ల స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రకటించింది. పూర్తి జాబితా
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మేం సిద్ధం అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమన్వకర్తలను ప్రకటించి జోరు మీదుంది వైఎస్ఆర్సిపి పార్టీ. సరిగ్గా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రోజునే 175 అసెంబ్లీ స్థానాలు మరియు 25 లోక్సభ సీట్లకు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఇంతకుముందు విడుదలవారీగా ప్రకటించిన సమన్వయకర్తల జాబితాలో స్వల్ప మార్పులతో మొదటి జాబితాను ప్రకటించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2019 తరహాలోనే ఈసారి కూడా ధర్మాన ప్రసాదరావు ఎంపీ నందిగామ సురేష్ ఎంపీ , ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను ప్రకటించారు . ఎంపీ అభ్యర్థుల జాబితాను సురేష్ , ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ధర్మాన ప్రకటించారు. ఒక్క అనకాపల్లి లోక్సభ స్థానం మినహాయించి మిగతా చోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు.

25 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల జాబితా..
క్రమసంఖ్య | లోక్ సభ స్థానం | అభ్యర్థి పేరు |
1 | శ్రీకాకుళం | పేరాడ తిలక్ |
2 | విజయనగరం | బెల్లాన చంద్రశేఖర్ |
3 | విశాఖపట్నం | బొత్స ఝాన్సీ |
4 | అనకాపల్లి | (బీసీకి కేటాయింపు, పేరు ఇంకా ఖరారు కాలేదు) |
5 | అరకు | కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ |
6 | రాజమండ్రి | గూడూరి శ్రీనివాస రావు |
7 | కాకినాడ | చలమలశెట్టి సునీల్ |
8 | అమలాపురం | రాపాక వరప్రసాద్ |
9 | ఏలూరు | కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ |
10 | నర్సాపురం | గూడూరి ఉమాబాల |
11 | మచిలీపట్నం | సింహాద్రి చంద్రశేఖర్ రావు |
12 | విజయవాడ | కేశినేని నాని |
13 | గుంటూరు | కిలారు వెంకట రోశయ్య |
14 | నరసరావుపేట | పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ |
15 | బాపట్ల | నందిగామ సురేష్ బాబు |
16 | ఒంగోలు | చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి |
17 | నెల్లూరు | వేణుంబాక విజయసాయి రెడ్డి |
18 | తిరుపతి | మద్దిల గురుమూర్తి |
19 | చిత్తూరు | ఎన్.రెడ్డప్ప |
20 | రాజంపేట | పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి |
21 | కడప | వైఎస్ అవినాశ్ రెడ్డి |
22 | కర్నూలు | బీవై రామయ్య |
23 | నంద్యాల | పోచ బ్రహ్మానంద రెడ్డి |
24 | అనంతపురం | మాలగుండ్ల శంకర నారాయణ |
25 | హిందూపురం | జోలదొరశి శాంత |