పెళ్లిళ్లు, శుభకార్యాలు, పెద్ద కుటుంబ సమావేశాల కోసం ప్రయాణం అంటే సవాలే. బస్సులు బుక్ చేయాలి, టికెట్ల కష్టాలు ఎదుర్కొనాలి. కానీ ఇప్పుడు అలాంటివన్నీ మర్చిపోండి. మీ కోసం ఐఆర్సీటీసీ (IRCTC) ఒక అద్భుతమైన ఆప్షన్ అందిస్తోంది — పూర్తి ట్రైన్ లేదా కోచ్ బుకింగ్, అంటే ఒక్క భోగి మొత్తం మీరు బుక్ చేసుకోవచ్చు!
ఇది నిజమేనా? అవును, ఇది నిజం!
మీరు ఒకసారి 70 నుంచి 80 మంది వరకు కలిసి ప్రయాణించాలనుకుంటే, ట్రైన్‌లో ఉన్న ఒక కోచ్ (భోగి)ను మొత్తం బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇది IRCTC అందిస్తున్న FTR (Full Tariff Rate) Service ద్వారా సులభంగా చేయవచ్చు.
How to Book an Entire Train or Coach
- గూగుల్‌లో “FTR IRCTC” అని టైప్ చేయండి.
- https://www.ftr.irctc.co.in అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
- అందులో రిజిస్ట్రేషన్ చేయండి.
- మీ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి సమాచారం ఇవ్వాలి.
- బుక్ చేసుకోవాలనేది ట్రైన్ కోచ్ (Coach) అయితే ఎంపిక చేసుకోండి.
- కోచ్ టైప్ ఎంచుకోవచ్చు — AC కోచ్, నాన్-AC కోచ్, స్లీపర్ క్లాస్ ఇలా.
- ఎక్కడ ఎక్కుతారు, ఎక్కడ దిగుతారు అనే వివరాలు ఇవ్వండి.
- జర్నీ డేట్ ఎంచుకోండి.
- మీరు బుక్ చేయాలంటే కనీసం 30 రోజుల ముందు అప్లై చేయాలి.
- సెక్యూరిటీ డిపాజిట్ (రీసెప్టబుల్) గా ₹50,000 కట్టాలి.
- ఇది ప్రయాణం తర్వాత తిరిగి వస్తుంది.
- బుకింగ్ చేసిన 7 రోజుల్లోగా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే బుకింగ్ ఫైనల్ అవుతుంది.
ఖర్చు ఎంత అవుతుంది?
ఉదాహరణకు, భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో ఒక స్లీపర్ కోచ్ బుక్ చేయాలంటే దాదాపు ₹30,000 నుంచి ₹50,000 వరకు ఖర్చవవచ్చు. ఇది ట్రైన్, కోచ్ టైప్, దూరం మీద ఆధారపడి మారుతుంది.
ఎవరికి ఉపయోగపడుతుంది?
మీ కుటుంబంలో పెళ్లి ఉందా? 70–80 మంది ఒకే చోటికి వెళ్లాలి అనుకుంటున్నారా? బస్సులు బుక్ చేయడం కంటే ట్రైన్ కోచ్ బుకింగ్ చాలా సురక్షితమైనది, ఆర్థికంగా కూడా మంచిదే. పండగలు, గణేశ్ నవరాత్రులు, సంక్రాంతి వంటి రద్దీ కాలాల్లో ఈ సర్వీస్ అందుబాటులో లేకపోవచ్చు, కావున ముందే అప్లై చేయడం మంచిది.
చివరగా ఒక సూచన:
ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో, పెళ్లిళ్లు లేదా పెద్ద కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నవారితో తప్పకుండా షేర్ చేయండి. ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాదు, మంచి అనుభూతిని కూడా ఇస్తుంది!
Also Read : Dog Walker తో నెలకు రూ.4.5 లక్షలు సంపాదన! పెంపుడు కుక్కలే ఉపాధి













1 thought on “Indian Railways : ట్రైన్ లేదా కోచ్ ఎలా బుక్ చేసుకోవాలి?”