అమెరికా హెచ్-1బీ వీసాదారులకు కీలక సూచనలు.. ట్రావెల్ చేయడంపై ఆలోచించి వెళ్లాలి
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక, రాజకీయ రంగాల్లో అనేక మార్పులను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపే దిశగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే, ఈ మార్పుల ప్రభావం అమెరికా పౌరులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వలసదారులపై కూడా పడుతోంది. ముఖ్యంగా వీసాల నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు.
హెచ్-1బీ వీసాదారులు, వారి జీవిత భాగస్వాములు (F-1 వీసా హోల్డర్లు), అంతర్జాతీయ విద్యార్థులు, గ్రీన్ కార్డు కలిగినవారికి అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు పలు సూచనలు చేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ప్రతిపాదనలు తెరపైకి తీసుకురావడం, అలాగే వీసా రెన్యువల్ ప్రక్రియ మరింత కఠినంగా మారుతుండటంతో, స్వదేశానికి వెళ్లిన వారికీ తిరిగి అమెరికా రావడం సవాలుగా మారనుంది. అమెరికా కాన్సులేట్లలో స్టాంపింగ్ ఆలస్యం, విమానాశ్రయాల్లో గట్టి తనిఖీలు, నిర్బంధం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సీటెల్ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది కృపా ఉపాధ్యాయ్ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుతం హెచ్-1బీ లేదా ఎఫ్-1 వీసా రెన్యువల్ కోసం అమెరికా దాటి ప్రయాణం చేయాలనుకునే వారు పునరాలోచించుకోవాలి’’ అని సూచించారు. ఇంటర్వ్యూలకు మినహాయింపు ఉండే విధానంలో మార్పులు చేసినట్లు తెలిపారు. ‘‘మునుపు వీసా గడువు ముగిసిన 48 నెలలలోపు దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూలకు మినహాయింపు ఉండేది. కానీ, ఇప్పుడు ఈ వ్యవధిని 12 నెలలకు కుదించారు. దీంతో వీసా పొడిగింపు కావలసినవారు ఇంటర్వ్యూ కోసం ఎదురుచూడక తప్పదు’’ అని వివరించారు.
NPZ లా గ్రూప్ మేనేజింగ్ అటార్నీ స్నేహల్ బాత్రా మాట్లాడుతూ, ‘‘వీసా అపాయింట్‌మెంట్లు పొందడంలో జాప్యం ఒక సమస్య మాత్రమే. అయితే, అదనపు తనిఖీలు, భద్రతా అనుమతుల కారణంగా చాలా మంది వీసా ప్రక్రియలో నిలిచిపోతున్నారు. గతంలో అనేకసార్లు వీసా పొందినవారు కూడా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ట్రంప్ తన గత పాలనలాగే ఇప్పుడు కూడా వీసా పరిశీలన కఠినంగా ఉంచే అవకాశం ఉంది’’ అని అన్నారు.
అమెరికా సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) హెచ్-1బీ వీసాను ఆమోదించినా, అమెరికా కాన్సులేట్ అధికారులు దాన్ని తిరస్కరించే హక్కు కలిగి ఉంటారని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిరస్కరించిన వీసా దరఖాస్తును USCISకి తిరిగి పంపించే అధికారం వారికి ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశం వెలుపల ఉన్న ఉద్యోగులు తిరిగి అమెరికాకు రావడం మరింత కష్టతరమవుతుందని వారు తెలిపారు.
ప్రయాణం అనివార్యమైతే, వీసా ప్రక్రియలో ఏవైనా జాప్యాలు ఎదురైనా, ఉద్యోగులు మరియు యాజమాన్యాలు ఆన్‌లైన్ విధానంలో స్వదేశం నుంచే పని చేయగలిగేలా ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలని ఇమ్మిగ్రేషన్ న్యాయవాది రాజీవ్ ఎస్ ఖన్నా సూచించారు.
Also Read : వాతావరణం టుడే
[…] మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు భారత ఆర్థిక […]
[…] […]