ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ స్టేటస్ తెలుసుకోవాలా ? ఇలా తెలుసుకోండి..!

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ స్టేటస్ తెలుసుకోవాలా ? ఇలా తెలుసుకోండి..!

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రేషన్ కార్డు వ్యవస్థలో నూతన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో అనర్హుల కార్డులను రద్దు చేయడం, నకిలీ లబ్దిదారులను తొలగించడం జరిగితే… ఇప్పుడు మాత్రం కొత్త రేషన్ కార్డు ap జారీకి ముందు ఈకేవైసీ (eKYC) అనేది తప్పనిసరిగా అమలులోకి వచ్చింది.

కొత్త రేషన్ కార్డులకు ముందు ఈకేవైసీ తప్పనిసరి

ప్రభుత్వం నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్డు దారులు ఈకేవైసీ ప్రక్రియను పూర్తిచేయాల్సిందే. లబ్దిదారుల్లో చాలామందికి ఈ విషయంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా గతంలో ముగిసిన గడువును మరల ఈ నెలాఖరు వరకు పొడిగించారు.

ఈకేవైసీ అయ్యిందా లేదా? ఇలా చెక్ చేయండి

ఈకేవైసీ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు ప్రభుత్వం EPDS వెబ్‌సైట్‌లో ఒక ప్రత్యేక సెక్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇలా చెక్ చేయాలంటే:

  • గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి
  • సెర్చ్ బార్‌లో “EPDS AP” లేదా “EPDS1” అని టైప్ చేసి సెర్చ్ చేయండి
  • వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత పై భాగంలో ఉన్న Dashboard లేదా Ration Card మెనూ లోకి వెళ్లండి
  • అక్కడ Rice Card Search లేదా Application Search అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి.

మీ రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేసి Search చేయండి

ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మీ ఈకేవైసీ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇప్పటికే అయినదా? ఇంకా చేయాల్సి ఉందా? అన్నది అర్థమవుతుంది.

గడువు చివర్లో ఉంది – ఆలస్యం చేయొద్దు

ఇప్పటికే ఒకసారి గడువు పెంచారు. కానీ అధికారుల అభిప్రాయం ప్రకారం, ఈసారి మళ్లీ పొడిగింపు ఉండకపోవచ్చు. కావున, మీ ఈకేవైసీ స్టేటస్ చెక్ చేసి, అవసరమైతే వెంటనే దగ్గరలోని గ్రామ/వార్డు సచివాలయం లేదా రేషన్ షాపు E-PoS యంత్రం ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోండి.

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *