ఇంటింటికి చంద్రబాబు నాయుడు ప్రచారం ప్రారంభం షెడ్యూల్ ఇదే!

ఇంటింటికి చంద్రబాబు నాయుడు ప్రచారం ప్రారంభం షెడ్యూల్ ఇదే!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లేందుకు మరోసారి సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ఈ విజయాలను ఇంటింటికి తెలియజేయాలని ఆయన నిర్ణయించారు. దీంతో కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని, ‘గడప గడపకూ ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజకవర్గం అయిన కుప్పం నుంచే ఈ ఇంటింటి ప్రచారాన్ని జూలై 3వ తేదీన ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన జూలై 2వ తేదీ సాయంత్రం 6 గంటలకు కుప్పం చేరుకుంటారు. జూలై 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి శాంతిపురం మండలంలోని తిమ్మరాజుపల్లిలో డోర్ టూ డోర్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

ఈ ప్రచారంలో చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే కాక, కుప్పం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను కూడా తెలియజేయనున్నారు. మూడు గంటల పాటు కొనసాగే ఈ కార్యక్రమం అనంతరం ఉదయం 10:55 గంటలకు తుమ్మిసి వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో పబ్లిక్ మీటింగ్‌ను నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం ప్రభుత్వాసుపత్రిలోటాటా డిఐఎన్సి’ సెంటర్‌ను చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం 4:20 గంటలకు తుమ్మిసిలోని హెలిప్యాడ్ నుండి తిరిగి అమరావతికి బయలుదేరుతారు.

ఈ ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజలకు చేరువయ్యే దిశగా చంద్రబాబు నాయుడు కీలక చర్యలు చేపట్టారు. పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహం నింపేలా ఈ ప్రచారం ఉండనుంది.

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *