ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూపంలో స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే ఆగస్ట్ 2025 నుండి వీటి పంపిణీ ప్రారంభం కానుంది. మొత్తం 1.46 కోట్ల మంది పాత లబ్దిదారులకు బదులుగా, అదనంగా 2 లక్షల కొత్త కుటుంబాలకు ఈ ఆధునిక కార్డులు అందించనున్నారు.
ఈ స్మార్ట్ కార్డులు ATM కార్డు స్టైల్లో ఉండేలా డిజైన్ చేశారు. ఇందులో QR కోడ్, లబ్దిదారుడి ఫోటో, ఆధార్ లింక్ వంటి ముఖ్యమైన సమాచారం పొందుపర్చనున్నారు. నేతల చిత్రాలు లేకుండా, ప్రభుత్వం అధికారిక చిహ్నంతో తయారవుతున్న ఈ కార్డులు కొత్త డిజిటల్ యుగానికి నిదర్శనంగా నిలవబోతున్నాయి.
ఈ స్మార్ట్ కార్డులతో లభించే కీలక సదుపాయాలు:
- AePS ద్వారా పౌష్టికాహారం పంపిణీ
- ఆధార్ ఆధారిత డేటా ట్రాకింగ్
- ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం
- డిజిటల్ రేషన్ సరఫరాకు మార్గం
ఈ సేవలు పొందాలంటే లబ్దిదారుల వద్ద ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. పాత కార్డు ఉన్నవారితో పాటు, ఇటీవల కొత్తగా దరఖాస్తు చేసిన కుటుంబాలు కూడా ఈ కార్డుల ప్రయోజనాలు పొందగలుగుతారు.
స్థితి ఎలా చెక్ చేయాలి?
కొత్త రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవాలంటే https://vswsonline.ap.gov.in/ అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి, “Service Request Status Check” విభాగంలో Application Number మరియు క్యాప్చా కోడ్ నమోదు చేయాలి.
ప్రస్తుతం జిల్లాల వారీగా కార్డుల ముద్రణ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ స్మార్ట్ కార్డులు సంక్షేమ పథకాలకు కీలక రాహదారిగా మారనున్నాయి.
Also Read : Income Tax : ITR సమస్యల పరిష్కారానికి Tax Assist సేవ పూర్తి వివరాలు!