ఏపీ కేబినెట్ శుభవార్త: రైతులకు 24 గంటల్లో రూ.672 కోట్ల నిధుల విడుదల!

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో రైతులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. AP Govt Funds Release to Farmers లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, రైతులకు పెండింగ్‌లో ఉన్న ధాన్యం బకాయిలలో భాగంగా రూ.672 కోట్లను 24 గంటల్లో వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, “32,000 మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది” అని చెప్పారు. గత రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల సమయంలో మద్దతు ధర ఇవ్వడంలో ఆలస్యం జరగడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, NCDC ద్వారా AP మార్క్‌ఫెడ్ రూపంలో రూ.1,000 కోట్ల రుణం తీసుకోవడానికి జూలై 4న అనుమతి ఇచ్చారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటగా రూ.672 కోట్లు విడుదల చేస్తూ కీలకంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో 24 గంటల్లో క్రెడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది సమయోచిత, బాధ్యతాయుతంగా వ్యవహరించిన నిర్ణయంగా ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
ఇదిలా ఉండగా, సమావేశంలో చంద్రబాబు వైసీపీపై విమర్శలు చేస్తూ, “పెట్టుబడులను అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలకు మెయిల్‌లు పంపించి భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : రైతులకు ఊరట కలిగించే న్యూస్: సీఎం రేవంత్ విజ్ఞప్తిపై కేంద్రం తక్షణ స్పందన