Annadatha Sukhibhava స్టేటస్ వాట్సాప్‌లో చెక్ చేయడం ఎలా? పూర్తి గైడ్

ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త! అన్నదాత సుఖీభవ స్కీమ్ స్టేటస్‌ను ఇప్పుడు వాట్సాప్‌ ద్వారా సులభంగా చెక్ చేయవచ్చు. పూర్తి ప్రక్రియ, అర్హతలు, అవసరమైన పత్రాలు ఈ గైడ్‌లో తెలుసుకోండి.

అన్నదాత సుఖీభవ స్కీమ్ స్టేటస్ వాట్సాప్‌లో చెక్ చేయడం ఎలా? – పూర్తి సమాచారం

రైతు సంక్షేమానికి కట్టుబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అన్నదాత సుఖీభవ స్కీమ్ 2025 కింద అర్హులైన రైతులకు రూ.20,000 ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ పథకాన్ని PM-KISAN తో కలిపి అమలు చేయడం ద్వారా రైతులకు పెట్టుబడి నిధులు సకాలంలో అందించే ప్రయత్నం జరుగుతోంది.

ఇప్పుడు ఈ స్కీమ్ యొక్క స్టేటస్‌ను వాట్సాప్ ద్వారా తెలుసుకునే సౌలభ్యం ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ ఎలా చేయాలో, జాగ్రత్తలు, WhatsApp Governance Link అనే విషయాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

వాట్సాప్ ద్వారా స్టేటస్ చెక్ చేసే విధానం

ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన “మనమిత్ర” వాట్సాప్ నంబర్ (📞 95523 00009) ద్వారా ఈ క్రింది స్టెప్పుల ప్రకారం మీ స్కీమ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు:

స్టెప్ 1: మెసేజ్ పంపండి

మీ మొబైల్ నుంచి “హాయ్” అని 95523 00009 నంబర్‌కి పంపండి.

స్టెప్ 2: స్కీమ్ సెలెక్ట్ చేయండి

వచ్చే ఆప్ట్షన్లలో “అన్నదాత సుఖీభవ స్కీమ్” ను ఎంచుకోండి.

స్టెప్ 3: ఆధార్ నంబర్ ఇవ్వండి

మీ ఆధార్ నంబర్ ను నమోదు చేసి సబ్మిట్ చేయండి.

స్టెప్ 4: స్టేటస్ తెలుసుకోండి

మీ స్కీమ్ స్టేటస్, e-KYC వివరాలు, మరియు అర్హత సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Official Website : https://annadathasukhibhava.ap.gov.in/

WhatsApp Governance Link For Annadatha Sukhibhava Status Check : https://wa.me/9552300009

ముఖ్యమైన తేదీ:

మీ పేరు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే, జూలై 13, 2025 లోగా సమీప రైతు భరోసా కేంద్రం (RBK) లో ఫిర్యాదు చేసి, అవసరమైన పత్రాలతో అప్లై చేయండి.

జాగ్రత్తలు:

  • కేవలం అధికారిక నంబర్ (95523 00009) లేదా ప్రభుత్వ వెబ్‌సైట్ల ద్వారానే స్టేటస్ తనిఖీ చేయండి.
  • ఫేక్ లింకులు, ఎస్ఎంఎస్‌లు లేదా వెబ్‌సైట్ల నుంచి దూరంగా ఉండండి.
  • మీ ఆధార్ నంబర్ ఇతరులతో పంచుకోవద్దు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ డిజిటల్ అభివృద్ధి ఎంతో ఉపయుక్తం. వాట్సాప్ ద్వారా అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయడం వేగవంతమైన, సురక్షితమైన విధానం. మీ వివరాలు ఇప్పటికీ నమోదు చేయని వారు, వెంటనే నమోదు చేసుకుని, అర్హతను నిర్ధారించుకోండి.

Also Read : How to Check Thalliki Vandanam Status in WhatsApp – Step by Step తెలుగులో

Leave a Comment