అన్నదాత సుఖీభవ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చివరి తేదీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ పథకం ద్వారా ప్రతి అర్హత గల రైతుకు సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందులో భాగంగా తొలి విడత నిధుల విడుదల ఈ నెలలోనే జరగనుంది.
అన్నదాత సుఖీభవ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చివరి తేదీ
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత గల రైతులు ఈ నెల 20వ తేదీ లోగా తాము నివసించే గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో (Rythu Seva Kendra) తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఆధారాలు సమర్పించి నమోదు ప్రక్రియ పూర్తిచేయాలి.
అన్నదాత సుఖీభవ పథకం అమలులో తీరుగా మూడు విడతలు:
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి అనుసంధానంగా తీసుకొస్తున్నారు. పీఎం కిసాన్ పథకంలో వచ్చే రూ.6,000 మినహాయించి, మిగిలిన రూ.14,000ను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలయ్యేలోగా మొదటి విడత సాయం రైతులకు అందేలా రాష్ట్ర ప్రభుత్వం పథకం రూపకల్పన చేసింది.
అన్నదాత సుఖీభవ పథకం అర్హతలు :
ఈ పథకానికి కింది వారు అర్హులు కాదు:
- కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
- ప్రజాప్రతినిధులు
- ఆదాయపు పన్ను (ఇన్కమ్ ట్యాక్స్) చెల్లించే వారు
ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తారు. ఇందుకోసం వెబ్‌ల్యాండ్ డేటా, రైతు పేరు, భూమి వివరాలు మొదలైనవి పరిశీలించి, సంబంధిత వ్యవసాయాధికారులు ఆ సమాచారంను వడపోత చేసి ప్రభుత్వంకి పంపుతారు.
అన్నదాత సుఖీభవ పథకం ఎంపిక ప్రక్రియ మరియు ఈ-కేవైసీ:
రైతు సేవా కేంద్రాల వద్ద నమోదు అయిన వివరాలు గ్రామ వ్యవసాయ సహాయకులు & మండల వ్యవసాయ అధికారుల ద్వారా వేరిఫై చేయబడతాయి. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారులు, రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపిన తరువాత ఆధార్ ఆధారంగా ఈ-కేవైసీ ప్రక్రియ చేపడతారు. అనర్హులు తొలగించబడి, చివరి లబ్ధిదారుల జాబితా రెడీ చేస్తారు.
సూచన: రైతులందరూ తప్పకుండా 20వ తేదీ లోపు వారి గ్రామ రైతు సేవా కేంద్రంలో నమోదు పూర్తి చేసుకోవాలి. ఏవైనా తప్పులు లేదా సందేహాలుంటే సంబంధిత వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చు. మీ గ్రామ రైతులందరికీ ఇది తెలియజేయండి. రైతే దేశానికి బాసట.. అన్నదాత సుఖీభవతో రైతుకు భరోసా.
One thought on “అన్నదాత సుఖీభవ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చివరి తేదీ”