Anil Menon : అంతరిక్ష అన్వేషణలో మరో మైలురాయిని భారత సంతతి చేరుకోనుంది. భారత మూలాలను కలిగి ఉన్న నాసా వ్యోమగామి డాక్టర్ అనిల్ మేనన్ 2026లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కు (ISS) తన తొలి అంతరిక్ష యాత్రను ప్రారంభించనున్నారు.
Anil Menon మిషన్ వివరాలు
అనిల్ మేనన్ రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మస్ సోయుజ్ MS-29 స్పేస్ క్రాఫ్టులో ఫ్లైట్ ఇంజినీర్ పాత్రను నిర్వహించనున్నారు. ఈ మిషన్‌ను కజకిస్థాన్ బాయ్కనూర్ కోస్మోడ్రోమ్ నుంచి నాసా 2026లో ప్రారంభించనుంది. ఆయనతో పాటు మరొక అమెరికన్ వ్యోమగామి మరియు రష్యన్ వ్యోమగామి కూడా పాల్గొంటున్నారు.
స్పేస్‌లో 8 నెలల శాస్త్రీయ ప్రయాణం
ఈ మిషన్‌లో అనిల్ మేనన్ మొత్తం 8 నెలలు స్పేస్ స్టేషన్లో గడపనున్నారు. అంతరిక్ష యాత్రల భవిష్యత్తుకు దోహదపడే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్, హెల్త్ రిసెర్చ్, మైక్రోగ్రావిటీ ప్రయోగాలు వంటి కీలక పరిశోధనలలో పాల్గొననున్నారు.
Doctor Anil Menon
అనిల్ మేనన్ మునుపు ఎయిర్ ఫోర్స్ వైద్యుడిగా సేవలందించారు. ఆయన స్పేస్ మెడిసిన్ మరియు ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ప్రత్యేకత కలిగి ఉన్నారు. నాసాలో వ్యోమగాముల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే టీమ్‌లో పని చేశారు. ఇది అనిల్ మేనన్‌కు తొలి స్పేస్ మిషన్ కావడం విశేషం.
భారత మూలాలు, ప్రపంచ స్థాయి విజయం
అనిల్ మేనన్ తండ్రి భారతీయుడు కాగా, తల్లి ఉక్రెయిన్‌కు చెందినవారు. అమెరికాలో జన్మించిన అనిల్ మేనన్ ఇప్పుడు భారత మూలాలకు గర్వకారణంగా అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు.
Also Read : Jahnavi Dangeti Biography | జాహ్నవి దంగేటి జీవిత చరిత్ర