వాతావరణం స్పోర్ట్స్ జాబ్ - ఎడ్యుకేషన్ బిజినెస్ లైఫ్ స్టైల్
రాశి ఫలాలు

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జెసికి చంద్రబాబు షాక్

On: January 27, 2024 10:35 AM
Follow Us:

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల దగ్గర పడుతున్న సందర్భంగా రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది.  వైయస్సార్ పార్టీలో సీట్లు ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంది.  కొందరు ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు ఇతర పార్టీలవైపు మొగ్గు చెబుతున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన మధ్య సీట్ల కేటాయింపులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇటు అనంతపురంలో టిడిపికి కీలకమైన జేసీ ఫ్యామిలీకి సీట్లు కేటాయింపు విషయంలో నారా చంద్రబాబునాయుడు గారు క్లారిటీ ఇచ్చారు.  దీంతో తెరమీదకు కొత్త సమీకరణాలు వస్తున్నాయి

Untitled design 8

చంద్రబాబు కసరత్తు :

వచ్చే ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక పైన నారా చంద్రబాబునాయుడు గారు కసరత్తు చేస్తున్నారు.  ఈ సమయంలో కొన్ని నియోజకవర్గాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.   ఎందుకంటే జగన్ సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్లను ఖరారు చేస్తున్న వేళ  చంద్రబాబు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు . రాయలసీమలో అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ తిరిగి పట్టు సాధించే ప్రయత్నం చేస్తుంది.  2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ జిల్లా నుంచి కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలిచింది.  ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర మొత్తం టిడిపి ఓడిపోయిన సరే, తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రం విజయం సాధించగలిగింది. ఈ జిల్లాలో ఈసారి జెసి ఫ్యామిలీకి సీట్లు ఖరారు విషయంలో చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Untitled design 2 2

జేసీ కుమారుడుకు నో సీట్ :

జేసీ బ్రదర్స్ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తమ కుమారులు పవన్, అస్మిత్ రెడ్డితో పాటుగా చంద్రబాబును కలిసారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల ఖరారు పైన చర్చించారు. జిల్లా రాజకీయాలు, సీట్లలో మార్పులు చేర్పుల గురించి చర్చ జరిగింది. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి ఇంఛార్జ్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అస్మిత్ స్థానంలో ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. అదే సమయంలో దివాకర్ రెడ్డి కుమారుడు సీటు విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు ఎంపీ సీట్లనూ ఈసారి బీసీలకే ఇవ్వాలని నిర్ణయించామని.. ఎంపీ సీటు ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు తేల్చేసారు.

కొత్త సమీకరణాలు :

2019 ఎన్నికల్లో దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ టీడీపీ నుంచి అనంతపురం ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ది తలారి రంగయ్య 141,428 ఓట్ల మెజార్టీతో పవన్ పైన గెలుపొందారు. ఈ సారి వైసీపీ నుంచి మాజీ మంత్రి శంకర నారాయణ పోటీ చేస్తున్నారు. హిందూపురం కూడా జగన బీసీ మహిళ శాంతమ్మకు కేటాయించారు. దీంతో..ఈ సారి రెండు స్థానాలను బీసీలకే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. తన కుమారుడుకు సీటు లేదని చంద్రబాబు తేల్చేయటంతో ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి రాజకీయంగా ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు జిల్లాలో చర్చకు కారణమవుతోంది. అదే విధంగా పరిటాల కుటుంబానికి ఒక్క సీటే ఇస్తామని చంద్రబాబు క్లారిటీ ఇవ్వటంతో జిల్లాలో టీడీపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.

మరిన్ని వార్తలు :

ఢిల్లీ నుండి పిలుపు ! పవన్ కళ్యాణ్ తో చంద్ర బాబు ప్రయాణం

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జెసికి చంద్రబాబు షాక్”

Leave a Comment