తెలంగాణ రాష్ట్రంలో రైతులకు శుభవార్త. ఇటీవల కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులకు కూడా త్వరలో రైతు భరోసా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ పూర్తి కాగా, అధికారులు ప్రస్తుతం అర్హుల గుర్తింపు ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 వేల మంది రైతులు కొత్తగా అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది.
అర్హులుగా గుర్తించిన రైతులకు ఈ నెల 15 నుండి 20వ తేదీల మధ్య నిధులు జమ చేసే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. దీంతో కొత్తగా పాస్‌బుక్ పొందిన రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా, గత నెల 23వ తేదీన ప్రభుత్వం తొలి విడతలో భాగంగా ఎకరానికి రూ.6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది.
రాష్ట్రంలో రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏడాది రెండు విడతల్లో ఆర్థిక సాయం అందిస్తుండగా, ఈసారి కొత్త పత్తాదారులను కూడా చేర్చడం ప్రత్యేకతగా మారింది.
ఇకపై అర్హులైన ప్రతి రైతుకూ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.












