Ustaad Bhagat Singh Review : ఉగాది పండుగ వేళ బాక్సాఫీస్ వద్ద ‘పవర్’ తుపాన్ మొదలైంది. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) నేడు (మార్చి 19, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా? గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయిందా? తెలుసుకుందాం.
ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ: పవర్ స్టార్ మాస్ జాతర!
కథేంటంటే?
తెలంగాణ ముఖ్యమంత్రిని (కేఎస్ రవికుమార్) అంతం చేయాలని ప్లాన్ చేసే విలన్ నాగప్ప (పార్థిబన్)కి, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్) ఎలా అడ్డుపడ్డాడు? అసలు భగత్ సింగ్ గతం ఏంటి? అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
- పవన్ కళ్యాణ్ స్వాగ్: వింటేజ్ పవన్‌ను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆయన డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయి.
- హరీష్ శంకర్ మార్క్: గబ్బర్ సింగ్ తరహాలోనే బాడీ లాంగ్వేజ్‌ను సరిగ్గా వాడుకున్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్స్, మహంకాళి ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయాయి.
- థమన్ BGM: సినిమాలోని ఎలివేషన్ సీన్లకు థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలం. ‘కాలర్ ఎయ్ ఎత్తరా’ పాట థియేటర్లో ఊపు తెప్పిస్తుంది.
- శ్రీలీల – రాశీ ఖన్నా: హీరోయిన్లు తమ గ్లామర్‌తో సినిమాకు కలర్ యాడ్ చేశారు.
మైనస్ పాయింట్స్:
- రొటీన్ స్టోరీ: కథలో కొత్తదనం తక్కువ. పాత కాలపు కమర్షియల్ ఫార్ములాతోనే సాగింది.
- సెకండాఫ్: అక్కడక్కడ కథనం నెమ్మదించినట్లు అనిపిస్తుంది. విలన్ పాత్ర కొంచెం బలహీనంగా ఉంది.
ఉస్తాద్ భగత్ సింగ్ రేటింగ్ :
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం రూపొందించిన పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్. రొటీన్ కథను పక్కన పెడితే, పవర్ స్టార్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ వీకెండ్ థియేటర్ కి వెళ్ళొచ్చు.
హిట్టా? ఫ్లాపా?
ప్రీ-రిలీజ్ బిజినెస్ మరియు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే, సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. అయితే లాంగ్ రన్ లో నిలబడాలంటే సామాన్య ప్రేక్షకుల మద్దతు ఎంతవరకు ఉంటుందో చూడాలి.
Also Read : Ustaad Bhagat Singh vs Dhurandhar 2: హైదరాబాద్ బుకింగ్స్ షాక్.. పవన్ కళ్యాణ్ కోటలో రణవీర్ సింగ్ పాగా?











