కేంద్ర ప్రభుత్వం PM Kisan 22వ విడత నిధులను విడుదల చేసిన నేపథ్యంలో, మీ గ్రామంలో ఎవరికి డబ్బులు వచ్చాయి? మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి.
బెనిఫిషియరీ లిస్ట్ (Beneficiary List) లో పేరు చూసుకోండి ఇలా:
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in కి వెళ్లండి.
- హోమ్ పేజీలో ‘Beneficiary List’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీ రాష్ట్రం (State), జిల్లా (District), మండలం (Block), గ్రామం (Village) వివరాలను సెలెక్ట్ చేయండి.
- ‘Get Report’ పై క్లిక్ చేయగానే మీ గ్రామంలోని అర్హులైన రైతుల పేర్లన్నీ కనిపిస్తాయి. అందులో మీ పేరు ఉంటే మీకు ₹2,000 జమ అయినట్లే.
లిస్ట్‌లో పేరు లేకపోతే ఏం చేయాలి?
ఒకవేళ మీ పేరు జాబితాలో లేకపోతే, దానికి ప్రధానంగా ఈ కింది కారణాలు ఉండవచ్చు:
- మీ e-KYC ఇంకా పూర్తి కాకపోవడం.
- మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ లేకపోవడం.
- భూమి రికార్డుల ధృవీకరణ (Land Seeding) పెండింగ్‌లో ఉండటం.
- వెంటనే మీ ఆధార్ కార్డు మరియు పట్టాదారు పాస్ పుస్తకంతో దగ్గరలోని మీ-సేవా కేంద్రం లేదా వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించండి.












