తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నుండి TGPSC OTR Mandatory Update 2026 పై కీలక ప్రెస్ నోట్ విడుదలైంది. ఇప్పటివరకు One Time Registration (OTR) చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. మొదట ఫిబ్రవరి ప్రారంభంలో లాస్ట్ డేట్ ఉండగా, తాజా ప్రకటన ప్రకారం ఫిబ్రవరి 25, 2026 వరకు గడువు పొడిగించారు.
చాలా మంది అభ్యర్థులకు “ఇప్పుడు నోటిఫికేషన్లు లేవు కదా, OTR ఎందుకు అప్డేట్ చేయాలి?”, “సర్టిఫికెట్లు మార్చాలా?”, “అప్డేట్ చేయకపోతే సమస్య ఉంటుందా?” వంటి సందేహాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్‌లో TGPSC One Time Registration అప్డేట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తున్నాం.
TGPSC OTR Mandatory Update 2026
TGPSC OTR Mandatory Update 2026 అనేది అభ్యర్థుల One Time Registration లోని ముఖ్యమైన వివరాలను సరిచేసుకునే అవకాశం. రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లకు ముందు అభ్యర్థుల సమాచారం అప్‌డేట్ అయి ఉండేలా ఈ ప్రక్రియను ప్రారంభించారు.
ముఖ్య ఉద్దేశాలు:
- రాబోయే నోటిఫికేషన్లకు ముందు డేటా అప్‌డేట్
- కొత్త కేటగిరీ మార్పులు (SC వర్గీకరణ)
- తాజా సర్టిఫికెట్లు జోడించుకోవడం
- అడిషనల్ క్వాలిఫికేషన్స్ అప్‌డేట్
TGPSC OTR Mandatory Update 2026
| ప్రెస్ నోట్ విడుదల | జనవరి చివరి / ఫిబ్రవరి ప్రారంభం 2026 |
| మొదటి గడువు | ఫిబ్రవరి ప్రారంభం |
| పొడిగించిన గడువు | ఫిబ్రవరి 25, 2026 |
గమనిక: లాస్ట్ డేట్ తరువాత కూడా కొన్ని సందర్భాల్లో నోటిఫికేషన్ ముందు అవకాశం ఇవ్వవచ్చు. అయినా ముందుగానే అప్డేట్ చేయడం మంచిది.
ఎవరు తప్పనిసరిగా TGPSC One Time Registration అప్డేట్ చేయాలి?
- కొత్తగా SC కేటగిరీ వర్గీకరణలో ఉన్న అభ్యర్థులు
- కొత్త క్వాలిఫికేషన్స్ పూర్తి చేసిన వారు
- EWS / Non Creamy Layer సర్టిఫికెట్లు మారిన వారు
- ఫోటో లేదా వ్యక్తిగత వివరాలు మారిన అభ్యర్థులు
- మొబైల్ నెంబర్ / ఈమెయిల్ మారిన వారు
ఏ వివరాలు తప్పనిసరిగా అప్డేట్ చేయాలి?
- తాజా ఫోటో : పాత ఫోటోతో పోలిస్తే ముఖంలో మార్పులు ఉంటే మార్చడం మంచిది.
- SC వర్గీకరణ సర్టిఫికెట్ : కొత్త SC కేటగిరీ (Group I, II, III) ప్రకారం కొత్త కుల సర్టిఫికెట్ తప్పనిసరి.
- EWS & Non Creamy Layer : ప్రతి సంవత్సరం మారే సర్టిఫికెట్లు కావడంతో తాజా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
- అడిషనల్ క్వాలిఫికేషన్స్ : Degree → PG → PhD , డిప్లొమా, కంప్యూటర్ కోర్సులు మొదలైనవి
- కాంటాక్ట్ వివరాలు : Valid Mobile Number, Active Email ID
ఏ వివరాలు మార్చలేరు?
- పేరు
- జన్మతేది
- కొన్ని ప్రధాన గుర్తింపు వివరాలు
- ఈ వివరాలను నమోదు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకు ఇప్పుడు OTR Mandatory Update?
- రాబోయే నోటిఫికేషన్లకు సిద్ధం కావడం
- కొత్త SC వర్గీకరణ అమలు
- అభ్యర్థుల తాజా డేటా కలిగి ఉండటం
- ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయడం
రాబోయే TGPSC నోటిఫికేషన్లు – ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు?
ప్రభుత్వ ఆమోదం ప్రకారం కొన్ని పోస్టులు త్వరలో రావచ్చని అంచనా:
- ఇంజనీరింగ్ శాఖలో ఉద్యోగాలు
- డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్
- DIET లెక్చరర్ పోస్టులు
- Group-1 నోటిఫికేషన్ (అంచనా)
ఇప్పటివరకు ఎన్ని మంది OTR చేసుకున్నారు?
- సుమారు 31.5 లక్షల మంది అభ్యర్థులు ఇప్పటికే One Time Registration పూర్తి చేశారు.
- మీరు కూడా ఒకసారి మీ OTR వివరాలు చెక్ చేసి అప్డేట్ చేయడం మంచిది.
TGPSC OTR Mandatory Update 2026 Offical Website
| Website name | URL |
| TGPSC (Telangana Public Service Commission) | Click Here |
FAQs – TGPSC OTR Mandatory Update 2026
Q1. TGPSC OTR Mandatory Update 2026 తప్పనిసరిగా చేయాలా?
Ans : అవును. ముఖ్యమైన వివరాలు మారితే తప్పనిసరిగా అప్డేట్ చేయాలి.
Q2. లాస్ట్ డేట్ తర్వాత కూడా అవకాశం ఉంటుందా?
Ans : కొన్ని సందర్భాల్లో నోటిఫికేషన్ ముందు అవకాశం ఇవ్వవచ్చు కానీ ముందుగానే పూర్తి చేయడం మంచిది.
Q3. పాత సర్టిఫికెట్లు పెట్టవచ్చా?
Ans : పెట్టవచ్చు. కానీ తాజా సర్టిఫికెట్లు ఉంటే మంచిది.
Q4. BC అభ్యర్థులకు కొత్త కుల సర్టిఫికెట్ అవసరమా?
Ans : అవసరం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ సరిపోతుంది.
Q5. కొత్త క్వాలిఫికేషన్స్ ఎలా అప్‌డేట్ చేయాలి?
Ans : OTR లో Additional Qualification సెక్షన్‌లో జోడించవచ్చు.
Conclusion
TGPSC OTR Mandatory Update 2026 అనేది రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లకు ముందస్తు చర్యగా తీసుకున్న కీలక నిర్ణయం. ముఖ్యంగా SC వర్గీకరణ మార్పులు, తాజా సర్టిఫికెట్లు, అడిషనల్ క్వాలిఫికేషన్స్ వంటి అంశాలు తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. ఫిబ్రవరి 25 వరకు గడువు ఉన్నప్పటికీ చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ఇప్పుడే మీ TGPSC One Time Registration వివరాలను సరిచేసుకోవడం ఉత్తమం.
Also read : Farmer Unique ID & e-Crop Registration: మీ ఫోన్‌లోనే ఈ-పంట రిజిస్ట్రేషన్ Step by Step Process







