ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం నుంచి మరోసారి శుభవార్త లభించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన కార్యక్రమంలో ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన రేషన్ కార్డుదారులకు ఒకేసారి రెండు కీలక నిర్ణయాలు ప్రకటించారు. త్వరలోనే రేషన్ దుకాణాల ద్వారా నూనె, కందిపప్పు, రాగులు, గోధుమపిండి అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో ఇది పేద కుటుంబాలకు పెద్ద ఉపశమనం కానుంది. అలాగే ఇప్పటివరకు నెలలో 15 రోజులు మాత్రమే రేషన్ అందుబాటులో ఉండగా, ఇకపై నెలంతా ఎప్పుడైనా రేషన్ సరుకులు తీసుకునే అవకాశం కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
రేషన్ కార్డుల ద్వారా అందిస్తున్న సరుకులు పేదలకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కూడా వేగంగా జరుగుతోంది. నాదెండ్ల మనోహర్ పాల్గొన్న నందివెలుగు గ్రామంలోని కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే రేషన్ అందిస్తుండగా, వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ముందస్తుగా ఇంటికే డెలివరీ అందిస్తున్నారు. కానీ త్వరలో నెల మొత్తంలో ఎప్పుడైనా రేషన్ సరుకులు తీసుకునే విధంగా మార్పులు రానున్నాయి. దీంతో లబ్ధిదారులు తాము సౌకర్యవంతంగా అనుకున్న రోజునే రేషన్ తీసుకోవచ్చు.
Ration cards latest news ప్రకారం, నూనె, కందిపప్పు, రాగులు, గోధుమపిండి పంపిణీకి అనుమతి ఇవ్వడం, అలాగే రేషన్ సరుకులు నెలంతా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రజలకు పెద్ద ఊరట అని చెప్పాలి. పేదల కోసం తీసుకున్న ఈ నిర్ణయం అనేక కుటుంబాలకు సహాయపడనుంది. రేషన్ కార్డుదారులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పునరుద్ఘాటించారు.












