పాలు విరిగిపోయాయని పోలీసులకు ఫిర్యాదు? ఈ ఘటన వైరల్!

హైదరాబాద్, కూకట్‌పల్లి: “పాలు విరిగిపోయాయి!” అనే విచిత్రమైన కారణంతో ఓ వ్యక్తి పోలీసుల దాకా వెళ్లాడు. ఆ విషయమే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

రాములు అనే వ్యక్తి కూకట్‌పల్లిలోనిసూపర్ మార్కెట్‌ నుంచి రెండు ప్యాకెట్ పాలు కొనుగోలు చేశాడు. వాటిలో ఒక ప్యాకెట్‌ను కట్ చేసి, వేడి చేసేందుకు గిన్నెలో పోసిన వెంటనే పాలు విరిగిపోయాయని ఫిర్యాదు చేశాడు.

ఆ పరిస్థితితో షాక్‌కు గురైన రాములు, వెంటనే అదే సూపర్ మార్కెట్‌కు వెళ్లి వాదనకు దిగాడు. అయితే దుకాణ సిబ్బంది మాత్రం, “మా బాధ్యత కాదు” అంటూ చేతులు దులిపారని తెలిపాడు. అంతే కాకుండా, బాధితుడు నేరుగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశాడు.

kukatpally-milk-burst-complaint-viral-news

ఈ విచిత్రమైన సంఘటనపై నెట్టింట జనాలు స్పందిస్తూ హాస్యాస్పదమైన మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు.
#పాలు_విరిగిపోయాయి, #కూకట్‌పల్లి_కేసు అనే హ్యాష్‌టాగ్‌లతో ట్రెండ్ అవుతోంది.

నెటిజన్లు కామెంట్ చేస్తూ:
పాలు కాకుండా మనోధైర్యమే విరిగిపోయినట్టుంది!


ఇకపై పాల ప్యాకెట్‌కి గ్యారంటీ కార్డు ఇస్తారా?


వెరీ సీరియస్ కేస్.. CBI విచారణ కోరాలి!” అంటూ చమత్కారాలు చెయ్యటం మొదలెట్టారు

Also Read : ఆధార్ కార్డ్ పర్సనల్ లోన్ ప్రాసెస్ 2025 Aadhar Card Personal Loan Process 2025

Leave a Comment