FASTag Annual Pass: రూ.3000కే సంవత్సరానికి 200 ప్రయాణాలు పూర్తి వివరాలు, ఆన్లైన్, ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రక్రియ

ఫాస్టాగ్ వార్షిక పాస్ పై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా గొప్ప ఆఫర్ అందించింది. FASTag annual pass రూపంలో తీసుకొచ్చిన ఈ కొత్త విధానం వల్ల దేశ వ్యాప్తంగా ప్రయాణం మరింత చవకగా మారనుంది. ఈ పాస్ ద్వారా వాహనదారులు ఏడాదికి రూ.3000 చెల్లించి ఏకంగా 200 టోల్ ప్రయాణాలు వినియోగించుకోవచ్చు. ఇది వాణిజ్యేతర ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.
ఈ పాస్‌ను 2025 ఆగస్టు 15 నుంచి అమలులోకి తేనున్నట్టు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
FASTag Annual Pass హైలైట్స్:
- ధర: రూ. 3000
- వ్యవధి: 1 సంవత్సరం లేదా 200 ప్రయాణాలు (ఏది ముందుగా పూర్తవుతుందో అది)
- ప్రారంభ తేదీ: 15 ఆగస్టు 2025
- ప్రయోజనాలు: దేశంలో ఎక్కడైనా టోల్ చెల్లింపుల అవాంతరాల్లేని ప్రయాణం
FASTag Annual Pass ప్రయోజనాలు (Benefits)
- సరళమైన ప్రయాణం – టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గుతుంది.
- ఆర్థికంగా ఆదా – తరచూ ప్రయాణించే వారికి టోల్ చార్జీలు తగ్గడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది.
- సౌకర్యవంతమైన అప్లికేషన్ ప్రక్రియ – ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ లో రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు.
- పోర్టబులిటీ – దేశవ్యాప్తంగా ఏ నేషనల్ హైవే అయినా ఈ పాస్ ఉపయోగించవచ్చు.
FASTag Annual Pass Eligibility: ఎవరు ఈ పాస్ తీసుకోవచ్చు?
ఈ పాస్ వాణిజ్యేతర ప్రయివేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. టాక్సీలు, బస్సులు, ట్రక్కులు వంటి వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు.
How to Apply FASTag Annual Pass – అప్లికేషన్ గైడ్
ఈ పాస్ కోసం మీరు రెండు విధాలుగా అప్లై చేయవచ్చు – ఆన్‌లైన్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ ద్వారా.
How to Apply Online FASTag Annual Pass (ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ)
- FASTag అధికారిక వెబ్‌సైట్ (NHAI/MoRTH లేదా Rajmarg Yatra App) లేదా మీ బ్యాంక్ FASTag పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.
- FASTag Interface ఎంపిక చేసి “Annual Pass” సేవను సెలెక్ట్ చేయండి.
- మీరు ప్రయాణించే వాహన వివరాలు (RC, Vehicle Number) నమోదు చేయండి.
- అవసరమైన కెవైసీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
- రూ. 3000 చెల్లింపు పూర్తి చేయండి.
- పాస్ యాక్టివేషన్ డేట్నుంచి 1 సంవత్సరం లేదా 200 ట్రిప్పులు వరకూ చెల్లుబాటు అవుతుంది.
గమనిక: పేమెంట్ అయిన తర్వాత మీరు SMS లేదా ఇమెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ మెసేజ్ పొందుతారు. దానిని భద్రంగా ఉంచండి.
How to Apply Offline FASTag Annual Pass (ఆఫ్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ)
- మీకు సమీపంలోని టోల్ ప్లాజా లేదా ఫాస్టాగ్ కేంద్రానికి వెళ్లండి.
- వారు అందించే అప్లికేషన్ ఫారమ్‌ను నింపండి.
- మీ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), ఫాస్టాగ్ ID, మరియు కెవైసీ డాక్యుమెంట్లు సమర్పించండి.
- వార్షిక పాస్ ధరను (రూ.3000) చెల్లించండి.
- సేవ అధికారికంగా ప్రారంభమైన తర్వాత పాస్ యాక్టివేషన్ పూర్తి అవుతుంది.
FASTag Annual Pass తో ట్రాఫిక్ తగ్గుదల
నితిన్ గడ్కరీ గారు తెలియజేసిన ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న 60 కిమీ పరిధిలోని టోల్ ప్లాజాల పై ఫిర్యాదులకు ఇది పరిష్కారమవుతుందన్నారు. ఒకే పాస్ తో అన్ని టోల్ లావాదేవీలు పూర్తవడం వల్ల వివాదాలు తగ్గిపోతాయ్, టోల్ గేట్ల దగ్గర వేచిచూసే సమయం తగ్గుతుంది, ఇది ట్రాఫిక్ నిర్వహణకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు.
అప్లై చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి:
- మీ వాహనానికి చెల్లుబాటు అయ్యే ACTIVE FASTag ఉండాలి.
- FASTagను ఎవరైనా ప్రామాణిక బ్యాంకుల ద్వారా (HDFC, ICICI, Axis Bank) లేదా Paytm వాలెట్ ద్వారా పొందాలి.
- మీ పేరు మీదే వాహన రిజిస్ట్రేషన్ ఉండాలి.
- చెల్లింపు చేసిన తర్వాత మీ పాస్ FASTag ID కి లింక్ చేయబడుతుంది.
Coming Soon on Rajmarg Yatra App
ఈ సేవను త్వరలోనే Rajmarg Yatra App, NHAI మరియు MoRTH వెబ్‌సైట్ల ద్వారా యాక్టివేట్ చేసుకునేలా ప్రత్యేక లింక్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీని ద్వారా యాక్టివేషన్, అప్డేషన్, పునరుద్ధరణలన్నీ ఆన్‌లైన్‌లో సులభంగా చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని కోరుకునే ప్రతి ప్రయివేట్ వాహనదారుడికి ఈ FASTag Annual Pass ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం రూ. 3000కి 200 ప్రయాణాలు అంటే ఇది ట్రాఫిక్ వల్ల ఆగిపోయే సమయాన్ని, టోల్ చార్జీలను, ఫైనాన్షియల్ బరువును కూడా తగ్గిస్తుంది. ప్రయాణాలపై ఆదా కోరే వారందరికీ ఇది తప్పక వినియోగించాల్సిన ఆప్షన్!
Also Read : Thalliki Vandanam Payment Status Check Online ఎలా చెక్ చేయాలి?