Viral Video: నడిరోడ్డుపై ప్రాణాలతో చెలగాటం..

Viral Video: నడిరోడ్డుపై ప్రాణాలతో చెలగాటం..

Viral Video : జోగులాంబ గద్వాల్ జిల్లా

జీవితం విలువ ఎంత అనే విషయాన్ని మరచిపోయినట్లుగా ఓ యువకుడు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండలం పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, మానవపాడు నుండి ఉండవల్లి దాకా ఒక యువకుడు ట్రాక్టర్‌ను వేగంగా నడుపుతూ, తాపీగా ట్రాక్టర్‌పై పడుకుని డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. చుట్టూ భారీ వాహనాలు ఉన్నా, అతడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం గమనార్హం.

వీడియోను రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి చిత్రీకరించగా, ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీన్ని చూసి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసే ఇలాంటి స్టంట్లు వద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. ఇక ఈ వీడియోను ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.

Also Read : నేరేడు పండ్లు ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *