హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ Tilak Varma తన 23వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. నవంబర్ 8, 2002న జన్మించిన టిలక్, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తన ప్రతిభతో భారత క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. చిన్నప్పటి నుంచి బ్యాటింగ్‌లో అసాధారణ ప్రతిభ చూపిన టిలక్‌ను ఆయన తండ్రి విద్యాభ్యాసం వైపు మళ్లించాలని అనుకున్నప్పటికీ, ఈ యువకుడు తన కలల దారినే ఎంచుకున్నాడు.
2022లో ముంబై ఇండియన్స్ ₹1.7 కోట్లకు అతనిని ఐపీఎల్‌లో కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సీజన్‌లోనే టిలక్ తన అద్భుత బ్యాటింగ్‌తో రోహిత్ శర్మ దృష్టిని ఆకర్షించాడు. హిట్‌మ్యాన్‌గా పేరుగాంచిన రోహిత్ అతన్ని మెంటర్‌గా తీర్చిదిద్ది అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు. ముంబై ఇండియన్స్ తరఫున కీలక మ్యాచ్‌లలో టిలక్ చేసిన ప్రదర్శనలు జట్టుకు విజయాలు తెచ్చాయి.
అయితే, హార్దిక్ పాండ్యా ముంబై జట్టు కెప్టెన్‌గా వచ్చిన తర్వాత టిలక్‌కి అవకాశాలు తగ్గాయి. ఆ నిర్ణయం అభిమానుల్లో విమర్శలకు కారణమైంది. అయినప్పటికీ, టిలక్ వర్మ తన ధైర్యం, నిబద్ధతతో మరోసారి అంతర్జాతీయ స్థాయిలో స్థిరపడే దిశగా ముందుకు సాగుతున్నాడు.
ఈ రోజు, తన 23వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో టిలక్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నాయి. భారత క్రికెట్ భవిష్యత్తులో తదుపరి స్టార్‌గా, గిల్ వారసుడిగా, భవిష్యత్ కెప్టెన్‌గా ఈ యువ బ్యాట్స్‌మన్‌పై విశ్లేషకులు ఇప్పటికే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఇలాంటి బంధం ఎప్పుడైనా చూశారా? మనిషి – కాకి మధ్య అనుబంధం వెనుక నిజం!












