రైతులకు తీపి కబురు.. అకౌంట్ చెక్ చేసుకోండి.. డబ్బు జమ అవుతోంది..

తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతుభరోసా పథకం అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 54.74 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4666 కోట్లకు పైగా నిధులు జమ చేసారు. నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా ఈ నెలాఖరులోపు నిధులు జమ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మార్చి 25 నుంచి మూడు నుంచి నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. వాటిలో ముఖ్యంగా రైతుభరోసా పథకం ఒకటి. అయితే గత ప్రభుత్వం దీనిని రైతుబంధు పథకం పేరుతో అమలు చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాగా పేరు మార్చి ఎకరానికి అదనంగా రూ.1000 పెంచింది. రెండు దఫాలుగా ఒక్క సంవత్సరంలో ఎకరాకు రూ.12000 జమ చేయనున్నారు. అయితే ఇప్పటికే రైతభరోసా నిధులను అర్హులైన రైతు అకౌంట్లోకి ప్రభుత్వం జమ చేస్తూ వస్తోంది.

ఇప్పటి వరకు 3 ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసిన ప్రభుత్వం తాజాగా 3 ఎకరాల నుంచి 4 ఎకరాల మధ్య భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీనికి సంబంధించి మంగళవారం తెలంగాణ ప్రభుత్వం రూ.200 కోట్లను విడుదల చేసింది. దీంతో మొత్తం ఆ కేటగిరీల్లో రూ.500 కోట్లను ఇప్పటి వరకు ప్రభుత్వం రిలీజ్ చేసినట్లయింది. మొత్తంగా 54.74 లక్షల రైతులకు రూ.4666 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. ఈ నెలాఖరులోపు అర్హులైన ప్రతీ ఒక్క రైతుల ఖాతాల్లో నిధులను మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

అయితే ఎకరం వరకు భూమి ఉన్న అర్హులైన రైతులకు సంబంధించి కొన్ని సాంకేతిక కారణాలతో పాటు..అకౌంట్ నంబర్లు తప్పు ఇవ్వడంతో ఇప్పటి వరకు నిధులు జమ కాలేదు. ఇటీవల వ్యవసాయ అధికారులు వారి నుంచి సరైన వివరాలను సేకరించారు. దీంతో మార్చి 25వ తేదీన వారి అకౌంట్లో కూడా డబ్బులను జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్తగా పాస్ పుస్తకం తీసుకొని.. రైతుభరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి కూడా నిధులు జమ కాలేదు. ఎకరం, రెండు ఎకరాలు, మూడు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఎప్పుడో జమ కావాల్సి ఉండగా కాలేదు. తాజాగా వారి అకౌంట్లలో కూడా నిధులు జమ అవుతున్నాయి. కొత్తగా పట్టాపాస్ బుక్ తీసుకొని.. సంబంధిత ఏఈఓల ద్వారా రైతుభరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు.. వారి అకౌంట్లను చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. నాలుగు ఎకరాలలోపు ఉన్న కొత్త, పాత రైతుల అకౌంట్లలో నిన్నటి నుంచి రైతుభరోసా నిధులు జమ అవుతున్నాయి.

అయితే 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో కూడా ఈ నెలాఖరు లోపు నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా మండలాలు, గ్రామాల వారీగా అర్హులైన వారి వివరాలను సేకరించిన ప్రభుత్వం.. వారి అకౌంట్లోలో కూడా త్వరలో నిధులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు.

Leave a Comment

alekhya chitti hot photos goes viral Preity Mukhundhan : 2 సినిమాలతోనే స్టార్ క్రేజ్ సంపాదించిన టాలీవుడ్ బ్యూటీ Pooja Hegde: సౌత్‌లో విజయాలు, బాలీవుడ్‌లో ఎదురైన సవాళ్లు పాలక్ తివారీ మారిషస్ హాలీడేలో స్టన్నింగ్ లుక్స్‌ ఫోటోలు వైరల్! Varsha Bollamma Telugu Movie List Actress Divi Vadthya ఫిట్‌నెస్ ఫొటోలు ఫ్యాషన్ టచ్‌తో సోషల్ మీడియాలో వైరల్ శ్రీముఖి బీచ్ ఫోటోస్: వైరల్ అవుతున్న తాజా గ్లామర్ స్టిల్స్ చూడండి చమ్కీల చీరలో హెబ్బా పటేల్ అదిరిపోయే లుక్! naga manikanta wife daughter rare photos శ్రద్ధా దాస్ గ్లామర్ పిక్స్ కలకలం