26 Apr 2025, Sat

తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పసుపు కుంకుమ తులం బంగారం గ్యారంటీ

తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పసుపు కుంకుమ తులం బంగారం గ్యారంటీ

ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల ప్రచార జోరు పెరుగుతుంది. జనాల్లోకి వెళ్ళడానికి ప్రధాన పార్టీలు అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంటున్నా యి. తెలంగాణవ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్, డిసెంబర్ మూడో తేదీన కౌంటింగ్ ఉంటుంది. తెలంగాణతో పాటు చత్తీస్గడ్ , మధ్యప్రదేశ్ , మిజోరాం , రాజస్థాన్ ఎన్నికల కౌంటింగ్ కూడా అదే రోజున వెలువడుతుంది. రాజ ఎవరు ? బంటెవరు ? అనేది తేలేది డిసెంబర్ మూడో తేదీన !!!

బిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ఇచ్చిన హామీలకు దీటైన స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక తరహాలో ఇప్పటికే కొన్ని గ్యారెంటీలను ప్రకటించింది కాంగ్రెస్. వాటిని మేనిఫెస్టోలో చేర్చాల్సి ఉంది.

మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. మహాలక్ష్మి పథకం కింద ప్రతినెల 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ మరియు ప్రతి కుటుంబానికి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా వంటివి మొదలైనవి ఉన్నాయి.

పసుపు కుంకుమ పేరుతో వధువు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని హామీని మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. తాజాగా ఇదే పథకంలో మరో అంశాన్ని చేర్చడంపై కసరత్తు సాగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు తులం చొప్పున బంగారం ఇవ్వాలని ప్రతిపాదించింది. శ్రీధర్ బాబు సారధ్యంలో ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ ఈ హామీని పరిశీలిస్తుంది అధికారంలోకి వస్తే ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై చర్చిస్తోంది. వధువు కుటుంబానికి తులం బంగారం ఇచ్చి హామీని ఇంకా ఖరారు చేయలేదని శ్రీధర్ బాబు తెలిపారు ఈ ప్రతిపాదనలపై పిసిసి మరియు ఏఐసిసి ధ్రువీకరించాల్సి ఉంటుందని తెలిపారు.

బి ఆర్ ఎస్ కు షాక్ : కాంగ్రెస్ గూటికి హుజూర్నగర్ మున్సిపల్ చైర్ పర్సన్

2 thoughts on “తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పసుపు కుంకుమ తులం బంగారం గ్యారంటీ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *