టిఆర్ఎస్ మేనిఫెస్టో సందర్భంగా కెసిఆర్ సంచల ప్రకటన చేశారు రైతులకు పెట్టుబడి సాయం కింద తీసుకున్న రైతుబంధును అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఎకరానికి 12,000 రూపాయలకు పెంచటం దీన్ని క్రమంగా 16 వేల రూపాయల వరకు తీసుకువెళ్తాం అని కేసిఆర్ ప్రకటించారు.
పెన్షన్లు 5000 పెంచుతాం , కేసీఆర్ ఆసరా పెన్షన్లను ఐదువేల రూపాయల వరకు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 రూపాయలు చేస్తాం. ఆ తర్వాత ఏటా 500 రూపాయలు పెంచుతూ, 5000 రూపాయల వరకు తీసుకువెళతాం. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవంతంగా అమలు చేశారు. దివ్యాంగుల పింఛన్లు పెంచుతున్నాం. ఐదు లక్షల పైగా దివ్యాంగులకు 6000 రూపాయల వరకు పెంచుతాం. మార్చి తర్వాత 5000 రూపాయలు పెంచి తర్వాత ప్రతి సంవత్సరం 300 రూపాయలు చొప్పున పెంచుకుంటూ 6000 రూపాయల వరకు తీరుస్తామని వెల్లడించారు.
తాము అధికారంలోకి రాగానే అర్హులైన లబ్ధిదారులకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించారు. జర్నలిస్టులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ గరిష్ట ఇన్సూరెన్స్ పథకాన్ని 15 లక్షల రూపాయలకు పెంచుతామని తెలిపారు. దీన్ని జర్నలిస్టులకు కూడా వర్తింపజేసేలా ఆయా యాజమాన్యాలతో మాట్లాడతామని చెప్పారు.
కేసీఆర్ మేనిఫెస్టో
- పేదలకు ఇళ్ల స్థలాలు
- సౌభాగ్య లక్ష్మి పేరిట మహిళలకు ₹3,000 భృతి
- హైదరాబాదులో లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు
- జర్నలిస్టులకు ఉద్యోగుల తరహాలో హెల్త్ స్కీం
- కొత్తగా 119 గురుకులాల ఏర్పాటు
- మహిళా స్వాశక్తి గ్రూపులకు సొంత భవనాలు నిర్మాణం