6 ఏళ్లలోపు పిల్లలకు 1st క్లాస్ లో అడ్మిషన్ లేదు కొత్త నిబంధనలు

ఢిల్లీ ప్రభుత్వ విద్యాశాఖ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (DoE) కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఢిల్లీ పాఠశాలల్లో మొదటి తరగతిలో చేరాలంటే కనీసం 6 సంవత్సరాల వయస్సు ఉండటం తప్పనిసరి. అంతేకాదు, విద్యార్థులు ముందుగా మూడేళ్ల ప్రీ-ప్రైమరీ విద్య పూర్తి చేసి ఉండాలి.

ఈ నిర్ణయం జాతీయ విద్యా విధానం (NEP) 2020 మార్గదర్శకాలను అనుసరించి తీసుకున్నదని అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన అన్ని పాఠశాలలకూ ఈ Delhi Mandate 6 Year Age for Class 1st నిబంధన వర్తించనుంది.

కొత్త వయస్సు ప్రమాణాలు ఇలా ఉన్నాయి:

  • నర్సరీ (ప్రీస్కూల్ 1): 3+ సంవత్సరాలు
  • లోయర్ కేజీ (ప్రీస్కూల్ 2): 4+ సంవత్సరాలు
  • అప్పర్ కేజీ (ప్రీస్కూల్ 3): 5+ సంవత్సరాలు
  • క్లాస్ 1 (Class 1): 6+ సంవత్సరాలు

పిల్లలకు ఆటపాటలతో కూడిన బలమైన పునాది విద్యను అందించేందుకు ఈ మార్పులు అమలు చేస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేర్కొంది. పిల్లల భవిష్యత్తు కోసం సరైన వయస్సులో సరైన విద్య అవసరమని భావించి ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

సమగ్ర ప్రణాళికతో ముందుకు

పాఠశాలలు తమ విద్యా మాధ్యమాలను, తరగతుల పేర్లను కొత్త వయస్సు ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీలు, విద్యా నిపుణులు తదితరుల అభిప్రాయాలను స్వీకరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

ఈ విధానం ద్వారా ఢిల్లీ విద్యావ్యవస్థలో నాణ్యతతో కూడిన గణనీయమైన మార్పులు జరగనున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. పిల్లలకు సరైన సమయంలో సరైన విద్యను అందించడం ద్వారా దేశ భవిష్యత్తును నిర్మించవచ్చని జాతీయ విద్యా విధానం (NEP) 2020 స్పష్టంగా చెబుతోంది.

Also Read : తెలంగాణ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎప్పుడు? లుధియానా ఫలితాల తరువాత రాష్ట్రంలో ఉత్కంఠ

Leave a Comment