రైతులకు శుభవార్త : ఉచిత మొక్కలు, రూ.5,250 సాయం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని పామ్ ఆయిల్ సాగు సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రైతులకు పలు ప్రయోజనాలు కల్పించబడతున్నాయి. ముఖ్యంగా నీటి వసతి ఉన్న భూముల్లో ఆయిల్ పామ్ సాగు చేపడితే రైతులకు పెద్ద ఎత్తున ఆదాయం లభించే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
Andhra Pradesh Farmers Oil Palm Subsidy Highlights
100% రాయితీతో ఆయిల్ పామ్ మొక్కలు పంపిణీ : రైతులకు ఉచితంగా మొక్కలు అందజేయడం జరుగుతుంది.
- హెక్టారుకు రూ.5,250 నగదు సాయం : ఎరువులు, అంతర పంటల సాగు వంటి అవసరాల కోసం నాలుగు సంవత్సరాల పాటు హెక్టారుకు రూ.5,250 చొప్పున సాయం అందిస్తారు.
- రాయితీపై వ్యవసాయ యంత్రాలు : మినీ ట్రాక్టర్లు, ట్రాలీలు, గెల కట్ కత్తులు, చాప్ కట్టర్లు వంటి అవసరమైన యంత్రాలను ప్రభుత్వం రాయితీపై అందిస్తుంది.
- వర్మీ కంపోస్ట్ యూనిట్ స్థాపనకు సహాయం : ప్రొగ్రెస్‌డ్ సాగు విధానాలకు వర్మీ కంపోస్ట్ యూనిట్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహిస్తోంది.
- లాభాల దృష్టితో పామ్ ఆయిల్ సాగు : ఆయిల్ పామ్ మొక్కలు వేసిన నాలుగో ఏడాదిలో మొదటి ఫలితాలు లభిస్తాయి. అనంతరం 25 ఏళ్ల పాటు స్థిరమైన దిగుబడి లభిస్తుంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం టన్ను ఆయిల్ పామ్ ధర రూ.18,500 నుంచి రూ.19,000 వరకు ఉంది. ఇది రైతులకు స్థిరమైన ఆదాయ మార్గాన్ని కల్పించగలదు.
- మార్కెటింగ్‌లో ప్రభుత్వ సహకారం : రైతులు పండించిన ఆయిల్ పామ్ గెలలను పతంజలి, గోద్రేజ్ వంటి ప్రైవేట్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. మార్కెటింగ్ వ్యవహారాల్లో కూడా ప్రభుత్వం సహకారం అందించడంతో రైతులకు ఆందోళన అవసరం లేదు.
దరఖాస్తు ప్రక్రియ
పామ్ ఆయిల్ సాగు చేయాలనుకునే రైతులు స్థానిక రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొక్కలు ఉచితంగా లభించడంతోపాటు, పలు రాయితీలను పొందవచ్చు. ముఖ్యంగా నీటి వసతి ఉన్న భూముల్లో ఈ పంటను సాగుచేయడం వల్ల లాభాలు మరింతగా పెరుగుతాయి.
రైతులకు ప్రభుత్వ విజ్ఞప్తి
ఈ AP Palm Oil Subsidy పథకాన్ని రైతులు పూర్తిగా వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ఇది వంటనూనె కొరతను తగ్గించడంలో తోడ్పడడంతోపాటు, రైతుల ఆదాయాన్ని పెంచే గొప్ప అవకాశం. సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ మిషనరీలు, మార్కెటింగ్ మద్దతు వంటి అన్ని విభాగాల్లో ప్రభుత్వం పక్కాగా ముందుకు సాగుతోంది.