allu arjun : పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినిమా ప్రపంచంలోనూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. ‘పుష్ప 2’తో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు కొలీవుడ్ సక్సెస్ డైరెక్టర్ అట్లీతో ఓ మెగా ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు. సన్ పిక్చర్స్ అధ్వర్యంలో సుమారు రూ.800 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే మొదటి నుంచే భారీ అంచనాలను సృష్టించింది.
ఈ ప్రాజెక్ట్‌కి వర్కింగ్ టైటిల్‌గా AA22xA6 అనే పేరు వినిపిస్తోంది. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, యాక్షన్ డ్రామా మేళవింపుగా రూపొందుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటమే కాకుండా, ఐదు మంది హీరోయిన్లు కూడా నటించబోతున్నారని సమాచారం. బన్నీ సరసన దీపికా పదుకొణె ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందానా, జాన్వీ కపూర్ పేర్లు కూడా చర్చల్లో ఉన్నాయి.
తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలకమైన, పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ‘బాహుబలి’ సిరీస్‌లో శివగామిగా ఆమె చూపించిన నటన ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచేలా చేసింది. అలాంటి శక్తివంతమైన పాత్రలో మళ్లీ ఆమెను చూడబోతున్నామని తెలిసి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. స్టోరీ వినగానే రమ్యకృష్ణ వెంటనే అంగీకరించారన్న వార్త బయటకొచ్చింది. ఈ ఎంట్రీతో సినిమా రేంజ్ మరింత పెరిగే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబయిలో కొనసాగుతోంది. అల్లు అర్జున్ – మృణాల్ ఠాకూర్‌లపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. రాబోయే షెడ్యూల్‌లో రమ్యకృష్ణ జట్టు చేరబోతున్నారని టాక్. అయితే అధికారికంగా మేకర్స్ ఇప్పటివరకు ఏ ప్రకటన చేయకపోయినా, ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
ఈ సినిమా 2026 చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని అంచనా. అంతకుముందు అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘రవణం’ అనే టైటిల్‌తో మరో ప్రాజెక్ట్ చేయనున్నారని టాలీవుడ్ టాక్. ‘పుష్ప 2’ విజయంతో వచ్చిన క్రేజ్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటూ, ఇప్పుడు అట్లీ సినిమా ద్వారా పాన్ వరల్డ్ బ్లాక్‌బస్టర్‌ని టార్గెట్ చేస్తున్న అల్లు అర్జున్ కెరీర్ మరో లెవెల్‌కు వెళ్ళడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : Sangeerthana Vipin Latest Photos