Akkineni Naga Chaitanya : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇటీవలే తన ప్రేయసి, ప్రముఖ నటి శోభిత ధూళిపాళ్లతో వివాహం చేసుకుని కొత్త జీవన ప్రయాణాన్ని ప్రారంభించారు. మరోవైపు, “తండేల్” సినిమా సూపర్ హిట్‌తో అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చారు.
శోభిత మరియు చైతన్య గత ఏడాది డిసెంబర్‌లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కొంతకాలం ప్రేమలో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాల అంగీకారంతో గోవాలో జరిపిన గ్రాండ్ వేడుకలో ఒకటయ్యారు.
ప్రేమ కథకు మజిలీ
తాజాగా, ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత తమ ప్రేమ కథకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. 2018లో నాగార్జున ఇంటికి మొదటిసారి వెళ్లినప్పుడు అక్కినేని నాగ చైతన్యను కలిసినట్లు ఆమె తెలిపారు. ఆ సమయంలో చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఫాలో అవుతుండగా, ఆమె మాత్రం ఫాలో చేయలేదట. దీనిపై ఒక నెటిజన్ ప్రశ్నించడంతో, శోభిత కూడా చైతన్యను ఫాలో చేయడం మొదలు పెట్టినట్లు చెప్పింది.
స్నేహం ఎలా మొదలైంది?
2022 ఏప్రిల్‌లో, చైతన్యతో తన స్నేహం మొదలైనట్లు శోభిత వెల్లడించింది. అప్పటినుంచి వారిద్దరి మధ్య చాటింగ్ జరిగిందని, చైతన్య తెలుగు మాట్లాడమని ఆమెను అడిగేవాడని చెప్పారు. అలా తెలుగు మాట్లాడటం వల్ల తమ బంధం మరింత గాఢమైందని తెలిపారు.

ముంబైలోని ఓ కేఫ్‌లో చైతన్యను మొదటిసారి కలిసినట్లు ఆమె పేర్కొన్నారు. చైతన్య హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవారని, వారి మొదటి డేట్‌కు చైతన్య బ్లూ సూట్‌లో, తాను రెడ్ డ్రెస్‌లో ఉన్నారని చెప్పింది.
కుటుంబాలకు సంబంధించిన విషయాలు
నాగచైతన్య కుటుంబం నూతన సంవత్సర వేడుకలకు శోభితను ఆహ్వానించగా, మరుసటి ఏడాది శోభిత కుటుంబాన్ని చైతన్య కలిసినట్లు ఆమె తెలిపారు. అలా కుటుంబాల మధ్య అంగీకారం రావడంతో ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రపోజల్ చేసినట్లు శోభిత సీక్రెట్ రివీల్ చేసింది.
సినిమా లైఫ్‌తో పాటు ప్రేమ కథ కూడా స్పెషల్
అక్కినేని నాగ చైతన్య వ్యక్తిగత జీవితంలో శోభితతో కలసి కొత్త అడుగు వేయగా, తన సినిమా విజయాలతో కూడా అభిమానులకు మంచి ట్రీట్ అందిస్తున్నారు.
Also Read : Samantha Ruth Prabhu : హాస్పిటల్ ఫోటోతో