Ponguleti Srinivas Reddy గారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు మరియు లోక్సభ సభ్యుడు. 2014 నుండి 2019 వరకు ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుండి 16వ లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు.
Ponguleti Srinivasa Reddy Age, Date of Birth, Family
| పేరు | పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి |
| జననం | నవంబరు 4, 1959 |
| పుట్టిన ప్రదేశం | నారాయణపురం, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ |
| తండ్రి | రాఘవరెడ్డి, |
| తల్లి | స్వరాజ్యం |
| జీవిత భాగస్వామి | మాధురి |
| సంతానం | కుమారుడు (హర్షారెడ్డి), కుమార్తె (సప్ని). |
| రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ |
| నియోజకవర్గం | ఖమ్మం లోకసభ నియోజకవర్గం |
| విద్య | ఉస్మానియా యూనివర్సిటీ నుంచి దూరవిద్యలో బిఏ డిగ్రీ |
| Click Here | |
| Click Here | |
| Click Here |
Ponguleti Srinivas Reddy Political Career
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతూ మరియు వివిధ హోదాల్లో పనిచేశారు. 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలం తెలంగాణ వైకాపా అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. 2014లో జరిగిన 16వ లోక్సభ ఎన్నికలలో ఆ పార్టీ తరఫున ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పై 11, 974 ఓట్ల మెజారిటీతో గెలుపొంది, తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికలలో మరియు 2019 17వ లోక్సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు.
ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు మాజీ ఎంపీ Ponguleti Srinivas Reddy 2023 ఏప్రిల్ 10న భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఆయన 2023 జూలై రెండు న ఖమ్మంలో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి , కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 2023 జూలై 14న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్గా నియమితులయ్యారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో Ponguleti Srinivasa Reddy పలైర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 56,650 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read : YS Bharathi Reddy Age, Date of Birth, Family, Professional & Political Career













5 thoughts on “Ponguleti Srinivas Reddy Age, Date of Birth, Family”