TSPSC OTR Update Last Date, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చివరి తేదీని అధికారికంగా ఎప్రిల్ 10, 2026 వరకు పొడిగించింది. ఇప్పటివరకు OTR నమోదు చేయని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే నమోదు చేసిన అభ్యర్థులు తమ వ్యక్తిగత, విద్యార్హతలు మరియు ఇతర వివరాలను ఎడిట్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందుగానే నమోదు పూర్తి చేయాలని అభ్యర్థులకు సూచిస్తున్నారు.
TSPSC OTR
TGPSC One Time Registration అనేది అభ్యర్థి యొక్క వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, కేటగిరీ, లోకాలిటీ, అడ్రెస్ వంటి అన్ని సమాచారం ఒకే చోట నమోదు చేసే విధానం.
ముఖ్య ప్రయోజనాలు:
- ప్రతి నోటిఫికేషన్‌కు మళ్లీ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు
- త్వరగా అప్లై చేసే అవకాశం
- సర్టిఫికేట్ వెరిఫికేషన్ సులభం
TSPSC OTR Registration and Edit, Update Step by Step Process
Step 1: అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. TGPSC అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అక్కడ మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి:
- New OTR Registration
- Edit OTR
- Know Your TSPSC ID
ఇప్పటికే OTR ఉంటే Edit OTR పై క్లిక్ చేయండి.
Step 2: Login ప్రక్రియ
- TSPSC ID నమోదు చేయండి
- Date of Birth ఇవ్వండి
- Captcha ఎంటర్ చేయండి
- Get OTP పై క్లిక్ చేయండి
- మొబైల్‌కి వచ్చిన OTP ఎంటర్ చేసి Login చేయండి
Step 3: Basic Details చెక్ చేయండి
- ఈ వివరాలు ఖచ్చితంగా చెక్ చేయాలి:
- పేరు (SSC మెమో ప్రకారం)
- ఆధార్ నెంబర్
- జెండర్
- డేట్ ఆఫ్ బర్త్
- తండ్రి పేరు
ఆధార్ వివరాలు ఒకసారి అప్డేట్ చేస్తే మళ్లీ మార్చలేరు.
Step 4: Address & Contact Details
- Correspondence Address ఇవ్వండి
- Permanent Address అవసరమైతే వేరుగా ఇవ్వండి
- మొబైల్ నెంబర్ అప్డేట్ చేయండి
ఇది హాల్ టికెట్ & అధికారిక కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడుతుంది.
Step 5: Local Status & Study Details
- 1 నుండి 7వ తరగతి వరకు చదివిన స్కూల్ వివరాలు ఇవ్వండి
- అకడమిక్ ఇయర్ జాగ్రత్తగా నమోదు చేయండి
- Regular / Private వివరాలు నమోదు చేయండి
లోకాలిటీ నిర్ణయానికి ఇది కీలకం.
Step 6: Educational Qualification Update
ఈ వివరాలు నమోదు చేయండి:
- 10th Class
- Intermediate
- Degree
- PG / PhD
- Additional Qualifications
మార్క్స్, యూనివర్సిటీ, పాస్ అయిన సంవత్సరం సరిగ్గా ఇవ్వాలి.
Step 7: Photograph & Signature Update
- రీసెంట్ ఫోటో అప్లోడ్ చేయండి
- సిగ్నేచర్ అప్డేట్ చేయండి
అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్:
- SSC Memo
- Inter Memo
- Degree Memo
- Bonafide Certificates
- Caste Certificate
Step 8: Preview & Submit
- అన్ని వివరాలు Preview లో చెక్ చేయండి
- Declaration టిక్ చేయండి
- Submit బటన్ క్లిక్ చేయండి
Submit చేసిన తర్వాత 24 గంటలలో మాత్రమే ఎడిట్ అవకాశం ఉంటుంది.
TGPSC OTR Update లో తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- ఆధార్ & పేరు మార్చడం తర్వాత ఎడిట్ చేయలేరు
- SSC మెమో ప్రకారం పేరు నమోదు చేయాలి
- జెండర్ తప్పకుండా చెక్ చేయాలి
- సర్టిఫికెట్స్ క్లియర్‌గా అప్లోడ్ చేయాలి
- Previewలో ప్రతి వివరాన్ని చెక్ చేయాలి
అవసరమైన డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డు
- SSC మెమో
- ఇంటర్ మెమో
- డిగ్రీ / PG మెమో
- బోనాఫైడ్ సర్టిఫికెట్స్
- కాస్ట్ సర్టిఫికెట్
- ఫోటో & సిగ్నేచర్
TSPSC OTR Update Last Date
- కమిషన్ ప్రకారం OTR అప్డేట్ చివరి తేదీ March 25 గా నిర్ణయించారు.
- చివరి తేదీకి ముందే అప్డేట్ చేయడం మంచిది.
FAQs
Q : OTR లేకుండా అప్లై చేయచ్చా?
Ans : లేదు. ముందుగా OTR పూర్తి చేయాలి.
Q : OTR Submit తర్వాత ఎడిట్ చేయచ్చా?
Ans : అవును, కానీ 24 గంటలలో మాత్రమే.
Q : ఆధార్ వివరాలు తర్వాత మార్చచ్చా?
Ans : లేదు. ఒకసారి అప్డేట్ చేస్తే మార్చలేరు.
Q : TSPSC OTR Update last date
Ans : కమిషన్ ప్రకారం OTR అప్డేట్ చివరి తేదీ ఎప్రిల్ 10 గా నిర్ణయించారు.
TGPSC ఉద్యోగాలకు సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా OTR వివరాలను సరిచేసుకోవాలి. TGPSC OTR Registration and Edit Step by Step, TSPSC OTR Update Last Date చాలా మంది చేస్తున్న ఈ 5 పొరపాట్లు మీరేమీ చేయొద్దు, చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారితీస్తాయి కాబట్టి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చెక్ చేసి సబ్మిట్ చేయండి. రాబోయే నోటిఫికేషన్స్‌లో అవకాశాలు కోల్పోకుండా ఉండాలంటే ఇప్పుడే మీ OTR అప్డేట్ చేయండి.










