ట్రావెల్స్పోర్ట్స్బిజినెస్లైఫ్ స్టైల్

ఆంధ్రప్రదేశ్‌ రైతులకు శుభవార్త: అన్నదాత సుఖీభవ – PM కిసాన్ జాబితా విడుదల

On: ఫిబ్రవరి 14, 2026 11:14 ఉద.
Follow Us:
ap-annadatha-sukhibhava-pm-kisan-list-grievance-details

రాష్ట్రంలోని రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న PM కిసాన్అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ డి. ఢిల్లీ రావు తెలిపారు.

ఈ జాబితాలో తమ పేరు లేకపోయిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో తమ అర్జీలు అందజేయవచ్చు. అంతేకాకుండా, అన్నదాత సుఖీభవ పథకం పోర్టల్లోని గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని ఆయన సూచించారు.

ఫిర్యాదుల నమోదు చివరి తేదీ: జూలై 13

ఈ పథకానికి అర్హులైన రైతులకు ఈ నెలలోనే రూ.7,000 వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయగానే డబ్బులు జమ చేయబడతాయని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.

ముఖ్య సమాచారం:

  • అర్హుల జాబితా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంది
  • జాబితాలో పేరు లేకపోతే – ఫిర్యాదు చేసేందుకు 13వ తేదీ వరకు అవకాశం
  • అర్హుల ఖాతాల్లో ఈ నెలలోనే రూ.7,000 జమ
  • ఫిర్యాదుల కోసం: https://annadathasukhibhava.ap.gov.in/

రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు చేపట్టిన ఈ పథకం వల్ల లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వం సూచించిన సమయానికి అర్జీలు, ఫిర్యాదులు దాఖలు చేసి తమ అర్హతను నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment