అన్నదాత సుఖీభవ పథకం 2025 : మే నెల నుంచే ప్రారంభం సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభించనున్నట్లు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.

అలాగే, స్కూళ్లు ప్రారంభం కావడానికి ముందు విద్యార్థుల తల్లుల్ని గౌరవిస్తూ “తల్లికి వందనం” పథకం ద్వారా రూ.15,000 చొప్పున సహాయం చేయనున్నట్టు వెల్లడించారు.

కడపలో మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించబోయే మహానాడుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు మే 18వ తేదీ వరకు పూర్తవ్వాలని ఆయా కమిటీలకు సూచించారు. మహానాడు ముగిసిన తరువాత రాష్ట్ర స్థాయి పార్టీ కమిటీలను ఏర్పాటుచేస్తామని తెలిపారు.

అమరావతి రాజధాని పునర్నిర్మాణం కార్యక్రమం ప్రధాని సమక్షంలో ప్రారంభమైన నేపథ్యంలో, రాష్ట్ర రాజధానిపై దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా దృష్టి నిలిచిందని సీఎం అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా మరొక కీలక అడుగు వేసింది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన రైతు కుటుంబాలకు రూ.20,000 ఆర్థిక సహాయం అందించనుంది. ఈ సహాయం కౌలు రైతులకు కూడా వర్తించనుంది. వ్యవసాయ శాఖ ఈ పథకం అమలుకు అవసరమైన అర్హుల జాబితాను సిద్ధం చేస్తోంది, మరియు ఈ నెల 20వ తేదీలోగా ఈ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేయనున్నారు.

ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతులకు అందజేయనున్నారు, ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించే ‘పీఎం కిసాన్‘ పథకంలో రూ.6,000 కూడా భాగంగా ఉంటుంది. అటవీ భూములపై పక్కా హక్కులు ఉన్న గిరిజన రైతులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధిపొందగలుగుతారు.

అన్నదాత సుఖీభవ పథకం అర్హత కలిగిన వారు Who Can Apply for Annadatha Sukhibhav Scheme

  • ఒక కుటుంబంగా పరిగణించేవారు : భార్య, భర్త, పిల్లలు కలిపి ఒక కుటుంబంగా భావిస్తారు. పెళ్లయిన పిల్లలు వేరే కుటుంబంగా పరిగణించబడతారు.
  • వ్యవసాయంతో జీవనోపాధి పొందేవారు : వ్యవసాయం, ఉద్యానవనం (హార్టికల్చర్), పట్టు పరిశ్రమకు సంబంధించిన పంటలు సాగు చేసే రైతులు.
  • భూమి లేని కౌలు రైతులు : ఇతరుల భూములను లీజుకు తీసుకుని సాగు చేసే రైతులు కూడా అర్హులే.
  • అటవీ హక్కులు కలిగిన గిరిజనులు : అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ భూములపై హక్కులు కలిగి వ్యవసాయం చేస్తున్న గిరిజనులు.
  • తక్కువ స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు (నివారణతో) : మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్-4 ఉద్యోగులు, గ్రూప్-డి ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు.

అన్నదాత సుఖీభవ పథకం అర్హత లేని వారు (Who Are Not Eligible for Annadatha Sukhibhav Scheme)

  • ఆర్థికంగా బలమైన వర్గాలు : అధిక ఆదాయ గల కుటుంబాలు మరియు నెలకు రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు.
  • రాజకీయ పదవులు కలిగినవారు : మాజీ లేదా ప్రస్తుత లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ ఛైర్మన్లు మొదలైన రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు.
  • ప్రభుత్వ ఉద్యోగులు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేవారు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులు, స్థానిక సంస్థల్లో శాశ్వత ఉద్యోగులు.
  • ప్రొఫెషనల్ వృత్తి నిపుణులు : ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్లు తదితర ప్రొఫెషనల్స్.
  • పన్ను చెల్లించిన వారు : గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించిన వారు.
  • వ్యవసాయేతర భూముల మలచిన వారు : వ్యవసాయ భూములను కమర్షియల్ లేదా ఇతర భూములుగా మార్పు చేసిన వారు.

జూన్ 12న ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తి కానుంది

ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరియు పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు, జూన్ 12న ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని – ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి చర్యలను కించపరచే ప్రయత్నాలు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ చేస్తోందని విమర్శించారు. అలాంటి విమర్శలకు తగిన రీతిలో ప్రతిస్పందించాలన్నారు.

పార్టీకి కొత్తగా చేరిన సభ్యులకు సభ్యత్వ కార్డులు త్వరగా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా నామినేటెడ్ పదవులు భర్తీ చేశామని, మిగిలినవి కూడా త్వరలో నియమించనున్నట్టు హామీ ఇచ్చారు.

పదవుల కేటాయింపులో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం ఎంతగా సేవలందిస్తుందో, అంతే స్థాయిలో పార్టీ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. నేతలు ప్రజలతో, కార్యకర్తలతో ఎల్లప్పుడూ సంబంధం ఉంచాలని సూచించారు.

Leave a Comment