Manohar Parrikar Biography

Manohar Parrikar: ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హెల్మెట్ ధరించి స్కూటర్‌పై ఓ మధ్యవయస్సు వ్యక్తి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సమయంలో, వెనక నుంచి ఓ యువకుడు కారుతో వచ్చి పదే పదే హారన్ కొడుతూ దారి ఇవ్వమని అంటాడు. కానీ స్కూటర్‌పై ఉన్న వ్యక్తి పట్టించుకోకుండా అలాగే ఉండిపోయాడు. క్షణాల్లోనే కారులో ఉన్న యువకుడు కిందికి దిగుతూ, “నాకు తెలుసా, నేను ఈ ప్రాంత DSP కొడుకును! నాకే దారి ఇవ్వకుండా ఎలా?” అంటూ కోపంగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ స్కూటర్ వ్యక్తి ఓ మృదువైన నవ్వుతో, “అయితే బాబూ… నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి!” అని సమాధానం ఇచ్చాడు. ఈ సాధారణ వ్యక్తి, నిజానికి గోవా ముఖ్యమంత్రిగా, అలాగే దేశ రక్షణ మంత్రిగా సేవలందించిన మనోహర్ పారికర్ గారే!
Manohar Parrikar Age, Date of Birth, Family
పేరు | మనోహర్ పారికర్ |
జన్మతేది | 13 డిసెంబరు 1955 |
వయసు | 69 |
జన్మస్థలం | మపూసాలి, గోవా |
మరణం | మార్చి 17 2019 గోవా |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
తండ్రి | గోపాలకృష్ణ పారికర్ |
తల్లి | రాధాబాయి పారికర్ |
జీవిత భాగస్వామి | మేధా పారికర్ |
సంతానం | ఉత్పల్ పారికర్, అభిజిత్ పారికర్ |
మనోహర్ గోపాలకృష్ణ పార్రికర్ ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన తన విద్యను ఐఐటిలో పూర్తి చేశారు. ఐఐటిలో చదివి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు.
Manohar Parikar Wife

Manohar Parrikar son Abhijit Parrikar Marriage Picture

Utpal Parrikar with his wife Uma Parrikar

Manohar Parrikar Political Career
1994లో మనోహర్ పారికర్ తొలిసారిగా గోవా శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో గోవా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2000 అక్టోబర్ 24న మొదటిసారి గోవా ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు మరియు 2002 ఫిబ్రవరి 27 వరకు కొనసాగారు. తిరిగి 2002 జూన్ 5న రెండోసారి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. 2005 జనవరిలో భారతీయ జనతా పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు రాజీనామా చేయడంతో, మైనారిటీలో ఉన్నప్పటికీ ఆయన తన ప్రభుత్వం కొనసాగించగలిగారు. అయితే, 2007 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో దిగంబర్ కామత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2012 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించడంతో మరోసారి పారికర్ గోవా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన పేరు రాఫెల్ ఒప్పందం వివాదంలో కూడా ప్రస్తావించబడింది.
Manohar Parikar Awards
- 2020: భారత ప్రభుత్వంవారి నుండి పద్మభూషణ్ పురస్కారం
- 2018: సెప్టెంబర్ 28న గోవా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి గౌరవ డాక్టరేట్
- 2012: సీఎన్ఎన్-ఐబిఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ (రాజకీయ విభాగంలో)
- 2001: ఐఐటీ ముంబయి నుండి డిస్టింగ్విష్డ్ ఆల్మునస్ అవార్డు
Remembrance of Manohar Parikar
- ఫిబ్రవరి 2020లో, భారత రక్షణ అధ్యయనాల మరియు విశ్లేషణల సంస్థ (Indian Institute for Defense Studies and Analyses) ను మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ గా పునర్నామకరణం చేశారు.
- డిసెంబర్ 2022లో, గోవాలోని మొపా వద్ద కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు మార్చారు.