Nadendla Manohar Biography నాదెండ్ల మనోహర్

నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. ఆయన జనసేన పార్టీలో కీలకమైన రాజకీయ నేత. తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా సేవలందించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుమారుడు. నాదెండ్ల మనోహర్ 2018 అక్టోబర్‌లో జనసేన పార్టీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి చెందారు.
Nadendla Manohar Date of Birth, Age, Wife, Father, Mother
పేరు | నాదెండ్ల మనోహర్ |
జన్మతేది | 6 ఏప్రిల్ 1964 |
జన్మస్థలం | తెనాలి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
వయసు | 60 |
క్యాస్ట్ | కమ్మ |
తండ్రి | నాదెండ్ల భాస్కరరావు |
తల్లి | లలిత భాస్కరరావు |
జీవిత భాగస్వామి | డా. నాదెండ్ల మనోహరం |
సంతానం | మితుల్ నాదెండ్ల, లలిత్ నాదెండ్ల |
రాజకీయ పార్టీ | జనసేన పార్టీ |
వృత్తి | రాజకీయ నాయకుడు |
విద్య | కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. |
mnadendla | |
NadendlaManoharOnline | |
nadendlamanoharofficial |
Nadendla Manohar Political Career
మనోహర్ 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపస్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా నియమితులైన తర్వాత, 2011 జూన్‌లో శాసనసభ స్పీకర్‌గా నియమితమయ్యారు. 2011 నుండి 2014 వరకు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి శాసనసభ స్పీకర్‌గా విధులు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, నాదెండ్ల మనోహర్ 2014లో తెనాలి శాసనసభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. 2018 అక్టోబర్‌లో జనసేన పార్టీలో చేరి, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించలేకపోయారు.
మనోహర్ కమ్మ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన రాజకీయాలు మరియు క్రీడా రంగాలలో విశేషంగా తన ప్రతిభను చాటుకున్నారు.
అయన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభించి, పార్టీ కోసం పలు హోదాల్లో సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్న సమయంలో, రాష్ట్రంలో NSUI మరియు యూత్ కాంగ్రెస్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.
మనోహర్ జాతీయస్థాయి టెన్నిస్ క్రీడాకారుడు. ఆయన దేశం మరియు విదేశాల్లో నిర్వహించిన అనేక టెన్నిస్ టోర్నమెంట్లలో పాల్గొన్నారు. 1986 నేషనల్ గేమ్స్‌లో ఆయన కాంస్యపతకాన్ని గెలుచుకున్నారు.
Also Read : Kalvakuntla Taraka Rama Rao Biography
3 thoughts on “Nadendla Manohar Biography నాదెండ్ల మనోహర్”