నాలుగు నియోజకవర్గాలపై గట్టి ఫోకస్ పెట్టిన వైయస్ జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం ఇదే అంటున్నారు

నాలుగు నియోజకవర్గాలపై గట్టి ఫోకస్ పెట్టిన వైయస్ జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం ఇదే అంటున్నారు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు : ఆ 4 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.. జిల్లా నాయకులకు దిశానిర్ధేశం..

నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ గెలవాలన్న జగన్మోహన్ రెడ్డి జిల్లా నాయకులకు దిశా నిర్దేశం . పోయిన చోటే పట్టు బిగించాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. పార్టీ వీడిన వారి విషయంలో 2019 ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని, ఈ సార్వత్రిక ఎన్నికల్లో సైతం అనుసరించాలని వైయస్ జగన్ గట్టిగా ఫిక్స్ అయ్యారు.  ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెన్నంటే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిపై ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి.

పోయిన చోటే పట్టు బిగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు . పార్టీ నుండి వెళ్లిపోయిన వారి విషయంలో 2019 ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో సైతం అనుసరించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా ఫిక్స్ అయ్యారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెన్నంటే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిపై ఫోకస్ పెట్టారు వైయస్ జగన్ ముగ్గురు ఎమ్మెల్యేలు మరియు ఒక ఎంపీ అనూహ్యంగా వైసిపిని వీడి టిడిపి పార్టీలో చేయడంపై సీరియస్ గా ఉన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో మరోసారి వైసీపీ పట్టుకుని నిలపాలని చూస్తున్నారు అందులో భాగంగానే పోయిన చోట వెతుక్కోవడం కోసం ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టి పెట్టారు  రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు

ఇటీవల నెల్లూరు జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు వరుసగా పార్టీలో రాజీనామాలు సొంత పార్టీ జిల్లా నేతలో నెలకొన్న సంక్షోభం దృశ్య నెల్లూరు జిల్లా రాజకీయంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు బస్సు యాత్రలో విరామం సమయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలను పిలిచి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు నెల్లూరు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు మారుతున్న రాజకీయ సమీకరణాలు మరియు పార్టీ వీడిన తర్వాత నెలకొన్న స్థితిగతులపై ప్రత్యేకంగా చర్చించారు ఇప్పటికే నెల్లూరు జిల్లాను ప్రతిష్టాత్మకంగా భావించిన వైయస్ జగన్ పార్టీ సీనియర్ నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డిని బరిలో నిలిపారు  విజయసాయిరెడ్డిని ఎంపీగా బరిలో నిలిపారు ఈ నేపథ్యంలో ఎలాగైనా నెల్లూరు జిల్లాలో మరోసారి హ్యాట్రిక్ సాధించి పార్టీకి పునర్ వైభవాన్ని తీసుకురావాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు

వాలంటీర్లకు వైఎస్ జగన్ బంపర్ ఆఫర్

నెల్లూరు జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం పార్టీని వీడిన సీనియర్ నేతలను ఓడించడమే అని అంటున్నారు అందులో భాగంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన విజయసాయిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు నుంచి బరిలోకి దింపారు ఇప్పటికే పార్టీని వీడిన రెబల్ నేతలు ఆనం రామనారాయణరెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ల విషయంలో గట్టిగానే ఫోకస్ పెట్టారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆ మూడు అసెంబ్లీ మరియు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంటు పరిధిలో ఎట్టి పరిస్థితిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పార్టీ నేతలకు అల్టిమేట్ జారీ చేశారు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వీరికి ఏరి కోరి అవకాశం కలిపిస్తే పార్టీకి తీరని అన్యాయం చేశారని భావిస్తున్నారు వైఎస్ జగన్ అందులో భాగంగానే  ఆ నలుగురిని ఓడించాలని ప్రయత్నిస్తున్నారు జగన్  అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో ఒకరోజు ప్రత్యేకంగా బస చేసి మరి జిల్లా పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు

Source

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *