Pooja Hegde – సౌత్ ఇచ్చిన ప్రేమ, బాలీవుడ్ ఇచ్చిన నిరాశ

పూజా హెగ్డే మోడలింగ్ నుంచి సినిమాలకి వచ్చి  మొదట బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. మొహెంజదారో (2016)తో హిందీ ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్ కంటే ముందే, తెలుగు & తమిళ సినిమాల్లో మంచి పాత్రలు దక్కాయి. అరవింద సమేత, రాధేశ్యామ్, అల వైకుంఠపురములో లాంటి హిట్స్ సౌత్‌లోనే వచ్చాయి.

పూజా ప్రకారం, హిందీ సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ క్యారెక్టర్లే దక్కాయి. పెద్దగా నటనకు అవకాశం కలిగిన పాత్రలు ఇవ్వలేదని ఆమె స్పష్టం చేసింది.

సౌత్ సినిమాల్లో నా నటనను గుర్తించారు. మంచి క్యారెక్టర్ రోల్స్ ఇచ్చారు" అని పూజా చెప్పింది.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో సినిమాలో పూజా అద్భుతమైన పాత్రలో నటించింది. ఇది తన టాలెంట్‌ని చూపించడానికి మంచి అవకాశం అని చెప్పింది. 

ఇటీవల తెలుగు సినిమాల్లో ఛాన్సులు తగ్గినా, తమిళంలో పూజా బిజీగా ఉంది. అక్కడ కూడా విభిన్నమైన రోల్స్ చేస్తోంది.

బాలీవుడ్‌లో మొహెంజదారో తప్ప మిగతా సినిమాల్లో గ్లామర్ పాత్రలే ఎక్కువగా వచ్చాయని పూజా అంటుంది.

సౌత్‌లో కేవలం గ్లామర్ డాల్‌గా చూడలేదు, నటిగా గౌరవించారు. బాలీవుడ్‌లో మాత్రం అది తక్కువే – పూజా హెగ్డే.

తనకు ఇంకా ఇలాంటి బలమైన పాత్రలు కావాలని, సౌత్ & బాలీవుడ్ రెండింట్లోనూ విభిన్నమైన పాత్రలు చేయాలని పూజా అభిలాష.

పూజా హెగ్డేకి నిజమైన గుర్తింపు సౌత్‌  సినిమాల ద్వారా దక్కింది. గ్లామర్ కంటే  నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు చేసే  దిశగా ఆమె ముందుకు సాగుతోంది.